ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పర్యటన మీద కూడా ఏపీ మాజీ ముఖ్యమంత్రి కుటిల వ్యాఖ్యలు చేశారు. వరదల సమయంలో ఇంత నష్టం జరిగితే వరద ప్రాంతానికి సీఎం వెళితే బాధపడుతూ వచ్చి.. మాకు ఇది చేయండి.. అది చేయండి అని అడుగుతారు. కానీ మీరు బ్రహ్మాండంగా చేశారు. మీరు దేవుడు, ఇంద్రుడు, ఏసు ప్రభువు వచ్చేశారు. కాబట్టి మాకు ఇంకేమీ ప్రాబ్లమ్స్ లేవు. అన్ని మరిచిపోయామని చెబుతారా? ఏ మాత్రం బుద్ధి, జ్ఞానం లేదు వీరందరికీ అంటూ ఎప్పటిలాగే ఆయన తనదయిన శైలిలో రెచ్చిపోయారు. కానీ అసలు విషయాన్ని ఆయన మరిచారు.
అదేమంటే వైఎస్ జగన్ పరామర్శకు వెళ్ళింది పది రోజుల తరువాత. కానీ వరదలు వచ్చిన నాటి నుంచే అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఆ తరువాత వరద సాయం కూడా ప్రకటించారు. ఎవరూ అడిగే అవకాశం ఇవ్వకుండానే వరద మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. భారీ వర్షాలు, వరదలతో ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు తగిన పరిహారం చెల్లిస్తామని, పొలంలో ఇసుక మేటలు తొలగించేందుకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇసుక మేటల తొలగింపు కోసం హెక్టారుకు రూ.12 వేలు సాయం అందిస్తామని అన్నారు.
నిజానికి ఒక రకంగా ఈ వరదలు గతంలో వచ్చినట్లయితే వరద సహాయం కోసం బాధితులు ఎదురుచూసే పరిస్థితులు ఉండేవి. కానీ, జగన్ ప్రభుత్వం ప్రచారానికి పెద్ద పీట వేయకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోయింది. బాధితులకు కావాల్సినవన్నీ అందితే ఇంక వాళ్ళు ఎదురు ఎందుకు ప్రశ్నిస్తారు. ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు, పొలంలో నష్టం వచ్చిన వారికి నగదు సహాయం, అలాగే ప్రతి ఒక్కరికి వారికి తగ్గ సహాయం చేస్తూనే కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ప్రభుత్వ అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తాము అంటే అంత కంటే ఇంకా ఎక్కువ ఏమి కోరుకుంటారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రజలు ఏం కోరుకోవాలో కూడా ఆయనే డిసైడ్ చేసేట్లు కనిపిస్తోంది.. ఒకవేళ నిజంగా వైసీపీ ప్రభుత్వం తరఫున వాళ్లకు సహాయం అందకపోతే ప్రజలు ప్రశ్నించకుండా ఊరుకుంటారా? అసలు ఈ మాత్రం లాజిక్ కూడా లేకుండా చంద్రబాబు ప్రజలను తప్పుపట్టడం ఆయన కుటిల రాజకీయ బుద్ధికి తార్కాణం అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నా ఆయన ఓర్వలేకున్నారని భావిస్తున్నారు.
Also Read : YSR Pashu Sanjeevani – జగన్ దూకుడు.. ఏపీలో మరో కొత్త పథకం