iDreamPost
android-app
ios-app

ఇచట వాహనములు నిలుపరాదు రిపోర్ట్

  • Published Aug 28, 2021 | 5:05 AM Updated Updated Aug 28, 2021 | 5:05 AM
ఇచట వాహనములు నిలుపరాదు రిపోర్ట్

నిన్న మీడియం రేంజ్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద బాగానే సందడి నెలకొంది. కాస్త ఎక్కువ అంచనాలు ఉన్నది శ్రీదేవి సోడా సెంటర్ అయినప్పటికీ చిలసౌ తరహాలో ఏదైనా సర్ప్రైజ్ ఉంటుందేమోనని ఇచట వాహనములు నిలుపరాదు మీద అక్కినేని అభిమానులు అంతో ఇంతో అంచనాలు పెట్టుకున్నారు. దానికి తోడు ట్రైలర్ కాస్త ప్రామిసింగ్ గా అనిపించడం, స్టోరీ కాస్త డిఫరెంట్ ఫీలింగ్ ని ఇవ్వడం లాంటి కారణాలు హైప్ కి దోహద పడ్డాయి. అల వైకుంఠపురములో సపోర్టింగ్ రోల్ చేశాక గ్యాప్ తీసుకున్న సుశాంత్ సోలో హీరోగా నటించిన సినిమా ఇదే. ఏడాదికి పైగా రిలీజ్ కోసం వెయిట్ చేసిన ఈ చిత్రం ఎలా ఉందో సింపుల్ రిపోర్ట్ లో చూద్దాం

ఇంట్లో ఏకాంతంగా ఉన్న ప్రేయసిని కలుసుకోవడానికి వెళ్లిన ప్రియుడు అక్కడ అనుకోని పరిస్థితుల్లో ప్రమాదంలో ఇరుక్కుంటాడు. ప్రేమ కాస్తా ప్రాణాల మీదకు తెస్తుంది. ఓ హంతకుడిని వెతుకుతున్న కాలనీ వాళ్లకు మన హీరోనే టార్గెట్ అవుతాడు. ఇక ఆ పద్మవ్యూహం నుంచి ఎలా బయట పడ్డాడు అనేదే అసలు కథ. పాయింట్ లో నవ్యత ఉన్నప్పటికీ ప్రెజెంటేషన్ తడబడటంతో వాహనం కాస్త భరించలేని ప్రహసనంగా మారిపోయింది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్లాక్ వరకు అసలు దర్శకుడు ఏం ఆలోచించి రాసుకున్నాడో లేక జనాన్ని తక్కువ అంచనా వేసి ఇష్టం వచ్చినట్టు తీసుకుంటూ పోయాడో ఎంత జుత్తు లాగేసుకున్నా అర్థం కాదు.

సుశాంత్ తనవరకు బాగానే నెట్టుకొచ్చాడు కానీ తనకు సూట్ కానీ మాస్ హీరోయిజం ప్రయత్నాలు ఇలాంటి సినిమాల్లో ఇరికించడం మానుకోవాలి. స్టైలిష్ గా ఉండే క్యారెక్టర్లు తనకు నప్పవు. డీసెంట్ గా వెళ్తేనే ప్రేక్షకులు తనను ఆదరిస్తున్నారు. హీరొయిన్ మీనాక్షి చౌదరి గురించి తక్కువ మాట్లాడుకోవడం ఉత్తమం. క్యాస్టింగ్, ప్రొడక్షన్ సపోర్ట్ ఎంత ఉన్నా దర్శకుడు దర్శన్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేని సెట్ చేసుకోవడంలో విఫలమయ్యాడు. వెంకట్, ప్రియదర్శి, సునీల్, రవి వర్మ తదితరులు ఈ కారణంగానే నిస్సహాయులుగా మారిపోయారు. వాహనం నిలపడం ఏమో కానీ పంచర్ అయిన టైర్లతో ఇది మొదటి వారం ప్రయాణించడమే గొప్పనుకోవాలి

Also Read : నాని వచ్చేస్తున్నాడు : అఫీషియల్