నాని వచ్చేస్తున్నాడు : అఫీషియల్

By iDream Post Aug. 27, 2021, 03:15 pm IST
నాని వచ్చేస్తున్నాడు :  అఫీషియల్

ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ వేడుకున్నా, బెదిరించినా న్యాచురల్ స్టార్ నాని టక్ జగదీష్ వెనక్కు తగ్గలేదు. ముందు నుంచి ప్రచారంలో ఉన్న పండగ డేట్ కే ఫిక్స్ అయ్యాడు. సెప్టెంబర్ 10కే ప్రైమ్ డేట్ ని ఫిక్స్ చేస్తూ ఇందాక నానినే అధికారికంగా సినిమాలో చిన్న వీడియో బిట్ తో చెప్పేశాడు. సో తేదీ ఏమైనా మారొచ్చేమోనని ఎదురు చూసినవాళ్లుకు షాక్ తప్పలేదు. అమెజాన్ పాలసీ ప్రకారం వాళ్ళు ఒక్కసారి తేదీ అనుకున్నాక మళ్ళీ మార్చడం వెనక్కు తగ్గడం చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే టక్ జగదీష్ డేట్ రెండు వారాల ముందే లీకైనప్పటికీ దానికే కట్టుబడి తన ఉద్దేశం ఏంటో ఇండస్ట్రీకి జనానికి స్పష్టంగా చెప్పేసింది.

ఇప్పుడీ పరిణామంతో లవ్ స్టోరీ కొంత ఇరకాటంలో పడ్డట్టే. ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు ఒకటి ఓటిటిలో ఒకటి థియేటర్లో వస్తే ఖచ్చితంగా హాళ్లకు వచ్చే వసూళ్ల మీద ప్రభావం ఉంటుందని డిస్ట్రిబ్యూటర్లు గట్టి అభిప్రాయంతో ఉన్నారు. అందులోనూ చైతు సినిమా నిర్మాత స్వయానా పంపిణీదారుడు కావడంతో ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఆసక్తి నెలకొంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి ఇటీవలే ఓటిటికి వెళ్లాలనుకునే నిర్మాతలకు సపోర్ట్ ఇచ్చేలా ప్రెస్ నోట్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సో ఇప్పుడు ఎవరు అభ్యంతర పెట్టినా లేక ఆక్షేపణ చేసినా ఎలాంటి ప్రయాజనం ఉండదన్నది మాత్రం స్పష్టం.

ఈ లెక్కన ముందు సెప్టెంబర్ 9న ప్లాన్ చేసుకున్న నితిన్ మాస్ట్రో ఓటిటి రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఇన్ సైడ్ టాక్. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎక్కువ అంచనాలు ఉన్న టక్ జగదీష్ వల్ల మిగిలినవాటి మీద అంత దృష్టి ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్న తరుణంలో బాక్సాఫీస్ రిలీజుల విషయంలో టక్ జగదీష్ చాలా ప్రభావం చూపించబోతున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ లో రీతూ వర్మా హీరోయిన్. తమన్ సంగీతం సమకూర్చారు. గత ఏడాది వితో ఈ సంవత్సరం టక్ జగదీష్ తో వరసగా రెండు ఓటిటి రిలీజులు అందుకున్న నాని ఈసారి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడో

Also Read : వివాహ భోజనంబు రిపోర్ట్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp