iDreamPost
android-app
ios-app

పాకిస్థాన్ కు షాకిచ్చిన ICC! ఇండియాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది..

  • Author Soma Sekhar Published - 10:49 AM, Thu - 19 October 23
  • Author Soma Sekhar Published - 10:49 AM, Thu - 19 October 23
పాకిస్థాన్ కు షాకిచ్చిన ICC! ఇండియాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది..

వరల్డ్ కప్ లో ఎన్ని మ్యాచ్ లు జరిగినా.. జరుగుతున్నా.. ఇండియా-పాక్ మ్యాచ్ కు ఉన్న క్రేజే వేరు. ఇక వరల్డ్ కప్ లో దాయాది దేశాల మధ్య మ్యాచ్ జరిగి రోజులు గడుస్తున్నా గానీ.. ఈ మ్యాచ్ మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఇండియా-పాక్ మ్యాచ్ న్యూస్ లో నిలిచింది. ఈ మ్యాచ్ కు సంబంధించిన ఓ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ కు దిమ్మతిరిగే షాకిచ్చింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. దీంతో ఇండియాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్, నెటిజన్లు. మరి ఐసీసీ పాక్ క్రికెట్ బోర్డు కు ఇచ్చిన షాక్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

వరల్డ్ కప్ లో భాగంగా ఇటీవల ఇండియా-పాక్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం కూడా విదితమే. ఇక ఈ మ్యాచ్ లో ఎన్నో సంఘటనలు వరల్డ్ క్రికెట్ లో చర్చనీయాంశంగా మారాయి. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. స్టేడియం మెుత్తం టీమిండియా ఫ్యాన్స్ తో నిండిపోయింది. దీంతో అప్పటికే పాక్ జట్టుకు చెమటలు పట్టాయి అనుకుంటా. ఇక మ్యాచ్ టీమిండియా ఫ్యాన్ పాక్ బ్యాటర్ అవుటై డ్రస్సింగ్ రూమ్ కు వెళ్తుంటే.. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. దీనిపై పెద్ద చర్చే జరిగింది. ఇక ఈ అన్ని అంశాలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పై ఫిర్యాదు చేసింది. స్టేడియంలో టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ చేసిన రచ్చపై ఐసీసీతో మెురపెట్టుకుంది పాక్ క్రికెట్ బోర్డ్.

ఈ అంశంపై బీసీసీఐపై కూడా చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఈ ఫిర్యాదుపై ఐసీసీ ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదని తెలుస్తోంది. పాక్ కంప్లైంట్ ను ఐసీసీ పరిగణంలోకి తీసుకోలేదని, ఈ విషయంపై మేం ఎలాంటి యాక్షన్ తీసుకోట్లేదని ఐసీసీ తెలిపినట్లు ప్రముఖ వార్త సంస్థ పీటీఐ పేర్కొంది. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే స్టేడియంలో ప్రేక్షకులు చేసే రచ్చు ఎవ్వరూ బాధ్యులు కారని కొంతమంది క్రీడా పండితులు పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.