iDreamPost
android-app
ios-app

పాకిస్థాన్​పై ICC సీరియస్.. మికీ ఆర్థర్​ కామెంట్స్​కు స్ట్రాంగ్ కౌంటర్!

  • Author singhj Published - 03:46 PM, Tue - 17 October 23
  • Author singhj Published - 03:46 PM, Tue - 17 October 23
పాకిస్థాన్​పై ICC సీరియస్.. మికీ ఆర్థర్​ కామెంట్స్​కు స్ట్రాంగ్ కౌంటర్!

వన్డే వరల్డ్ కప్​లో ఎంతో ఉత్కంఠ రేపిన భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్​ ఆడియెన్స్​కు ఫుల్ మజాను పంచింది. టీమిండియా తన ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్​తో ప్రేక్షకులకు పైసా వసూల్ ఎంటర్​టైన్​మెంట్ ఇచ్చింది. అయితే ఈ మ్యాచ్​పై పాక్ కోచ్ మికీ ఆర్థర్ చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి. ఇండో-పాక్ మ్యాచ్​ను చూస్తుంటే ఐసీసీ ఈవెంట్​గా కాకుండా బీసీసీఐ ఈవెంట్​లా ఉందని మికీ ఆర్థర్ కామెంట్స్ చేయడం తెలిసిందే. మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్​లో మాట్లాడిన పాక్ కోచ్.. తమ టీమ్ పెర్ఫార్మెన్స్ నిరాశపర్చిందన్నాడు. అయితే పరోక్షంగా ఐసీసీ మీద విమర్శలు గుప్పించాడు.

పాక్ ఆడేటప్పుడు స్టేడియంలో సరైన సపోర్ట్ లభించలేదన్నాడు మికీ ఆర్థర్. ఇది ఐసీసీ ఈవెంట్​లా కాకుండా బైలాటరల్ సిరీస్​ మ్యాచ్​లా అనిపించిందని చెప్పాడు. మ్యాచ్​లో పాక్ ఎందుకు ఫెయిలైందనే దానిపై మాట్లాడకుండా ఐసీసీ, బీసీసీఐ అంటూ అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయడంతో పాక్ మాజీ క్రికెటర్ల నుంచే మికీ ఆర్థర్​ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటి కామెంట్స్ చేసే బదులు.. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోవాలని పాక్ మాజీలు ఆర్థర్​కు హితవు పలికారు. తాజాగా ఈ కాంట్రవర్సీపై ఐసీసీ రియాక్ట్ అయింది.

ఇలాంటి కాంటర్షియల్ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదంటూ పాకిస్థాన్​ కోచ్ మికీ ఆర్థర్​పై ఐసీసీ సీరియస్ అయింది. ‘ఐసీసీ నిర్వహించే ప్రతి ఈవెంట్​లో ఏదో ఒక దశలో ఇలాంటి కామెంట్స్ వస్తుంటాయి. అయితే, మేం వాటికి దూరంగా ఉంటాం. టోర్నీని మరింత బాగా నిర్వహిచేందుకు కావాల్సిన చర్యలు చేపడతాం. ఇప్పుడే మెగా టోర్నీ మొదలైంది. ఇంకా అనేక మ్యాచ్​లు జరగాల్సి ఉంది. టోర్నీని అత్యుత్తమంగా నిర్వహించేందుకు ఎలాంటి మార్పులు చేయాలి? అనే విషయంపై ఫోకస్ చేస్తాం. ప్రతి ఒక్కరికీ క్రికెట్​ను దగ్గర చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం. తప్పకుండా ఇదో బెస్ట్ వరల్డ్ కప్​గా నిలుస్తుందని ఆశిస్తున్నా’ అని ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్​క్లే స్పష్టం చేశాడు. మరి.. పాక్-ఐసీసీ వివాదంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమిండియాపై పాంటింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ సవాల్ తప్పదంటూ..!