iDreamPost
iDreamPost
కింద బడ్డా నాదే పై చేయి , లుగచెడ్డా నేనే సర్వం అనడం కొందరికే సాధ్యమేమో .
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుని పార్లమెంటరీ స్టాండర్డ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి నిన్న తప్పించిన కేంద్రం ఆయన స్థానంలో వైసీపీకి చెందిన ఎంపీ బాలసౌరిని నియమించింది . పంజాబ్ నేషనల్ బ్యాంక్ ని మోసం చేసారంటూ బ్యాంక్ వర్గాలు చేసిన పిర్యాదు మేరకు సీబీఐ లో ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం .
అయితే నిన్న రాత్రి రఘురామ రాజు మీడియాకి విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ ఆ పదవి తన స్వయంకృషితో తెచ్చుకున్నా వైసీపీ ఎంపీగా పార్టీ ద్వారా తనకి వచ్చిందని , తనని పదవి నుండి తప్పించలేదని ఏడాది గడువు ముగియడంతో తానే దయ తలచి ఇచ్చానన్నట్టు చెప్పుకొన్నారు . ఒహవేల తనని పార్టీ నుండి డిస్మిస్ చేస్తే పులివెందులలో పోటీ చేసి రెండు లక్షల ఓట్ల మెజారిటీ తెచ్చుకొంటానని సవాల్ విసిరిన రఘురామ రాజు దాన్ని అమరావతి పై రిఫరెండం గా తీసుకోవాలని కోరారు .
Also Read: సీఎం లేఖ ఇదే మొదటిసారి కాదు – ఉండవల్లి
రఘురామ రాజు మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో కానీ 2019 లో ఏర్పాటు చేసిన పార్లమెంట్ కమిటీల్లో వైసీపీ నుండి రఘురామ రాజుతో పాటు మరో ఆరుగురిని ఆయా కమిటీల్లో నియమించగా 2020 లో కమిటీ సభ్యుల పునర్నియమాకంలో రఘురామ రాజు తప్ప మిగిలిన ఆరుగురికి స్థానం లభించడంతో పాటు మరో ఇద్దరికి అదనంగా ప్రాతినిధ్యం లభించింది . గత ఏడాది వైసీపీ సిఫారసుతో సంభందం లేకుండా తన స్వయంకృషితో కమిటీలో స్థానం సంపాదించుకున్న వ్యక్తి ఈ సంవత్సరం ఎందుకు స్థానం సంపాదించుకోలేకపోయాడో రాజే చెప్పాలి . కమిటీ గడువు ముగిసి మళ్లీ ఎన్నుకోవటానికి వైసీపీ సిఫారసు చేయక , బిజెపి నియమించక పదవి కోల్పోయిన రఘురామ రాజు తాను ముష్టి వేస్తున్నా అని అనడం చూస్తే తన పేరులో ఉన్న రాజు చూసుకొని తాను నిజంగా మహారాజునని భ్రమిస్తూ ఉన్నట్లుంది .
పులివెందులలో జగన్ పై పోటీ చేసి రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ఏ మొండి ధైర్యంతో అన్నాడో కానీ విన్నవారికి మాత్రం రఘురామ రాజుకి కనీసపు రాజకీయ అవగాహన లేదని లేదా మానసిక స్థిరత్వం కోల్పోయాడని అనిపించడంలో తప్పు లేదు . రాష్ట్ర రాజకీయాల గురించి కనీస అవగాహన ఉన్న ఎవరైనా పులివెందుల గడ్డ అంటే వైఎస్సార్ అడ్డా అని చెబుతారు . 1978 నుండి నేటి వరకూ ఓటమి ఎరగని చరిత్ర వైఎస్ కుటుంబం సొంతం .
గత చరిత్ర పక్కన పెట్టినా మొత్తం 223000 ఓటర్లు ఉన్న పులివెందులలో 2019 ఎన్నికలో పోలైన ఓట్లలో 73 శాతంతో జగన్ 132356 ఓట్లు సాధించగా గెలవగా , ప్రతిపక్ష టీడీపీ నుండి సతీష్ రెడ్డి 23 శాతంతో 42 వేల ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలవగా 2100 ఓట్లతో మూడో స్థానం ‘నోటా’ కి వచ్చింది . 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఓడించటానికి చేయని ప్రయత్నం లేదు . జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకోగలిగాడు కానీ పులివెందుల గడ్డ పై స్థానం సంపాదించుకోలేకపోయాడు .
Also Read: రాజధానికి ముంపు లేకుంటే కొండవీడు లిఫ్ట్ ఎందుకు కట్టారు బాబు?
2019 ఎన్నికలకు ముందు వైసిపి పై టీడీపీ ప్రదర్శించిన దూకుడులో భాగంగా వైసీపీ నుండి టీడీపీలోకి ఫిరాయించిన జలీల్ ఖాన్ పులివెందులలో జగన్ పై తన కూతుర్ని నిలబెట్టి గెలిపిస్తానని సవాల్ చేయగా , మాజీ నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమా , మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి కూడా ఈ సారి జగన్ ని పులివెందులలో కూడా గెలవనివ్వమని ప్రగల్బాలు పలికారు . మరోవైపు టీడీపీ మిత్రపక్ష జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కడప ఏమైనా వారి అడ్డానా ఈ సారి వారి ఆటలు సాగనివ్వం అంటూ పలు వ్యాఖ్యలు చేశారు .
అయితే 2019 ఎన్నికల్లో పులివెందులలో గెలవడం సంగతి పక్కన పెడితే వీరెవరూ తమ సొంత నియోజక వర్గాల్లో సైతం ఓటమి చెందగా ఈ సవాళ్ళన్నిటినీ మౌనంగా వింటూ వచ్చిన జగన్ ఎన్నికల్లో తన అద్వితీయ విజయంతో వీరికి సమాధానం చెప్పాడు . 19 ఎన్నికల్లో జగన్ ప్రత్యర్థిగా ఉన్న సతీష్ సైతం చంద్రబాబు ప్రవర్తనకు విసిగి ప్రస్తుతం వైసీపీలో చేరడంతో పులివెందులలో జగన్ ప్రత్యర్థిగా తర్వాతి స్థానంలో నోటా మాత్రమే నిలిచినట్లు అయ్యింది . 180000 ఓట్లు మాత్రమే పోలైన పులివెందులలో జగన్ పై రెండు లక్షల ఓట్లు సాధిస్తానంటున్న రఘురామరాజు లేని ఓట్లతో ఏ లెక్కల ప్రకారం మెజారిటీ తెచ్చుకొంటాడో కానీ రేపటి రోజున ఎంపీగా డిస్మిస్ అయితే ఆ ఆవేశంలో వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో తాను గెలుస్తానని అన్నా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు .