Krishna Kowshik
Krishna Kowshik
హా..హా.. హాసిని అంటూ బొమ్మరిల్లుతో పక్కింటి అమ్మాయిలా అలరించిన నటి జెనీలియా డిసౌజా. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన బాయ్స్ సినిమాలో హరిణి పాత్రతో మెప్పించిన ఈ భామ.. తెలుగులో సత్యం, సై, బొమ్మరిల్లు, నా అల్లుడు, సుభాష్ చంద్రబోస్, హ్యాపీ వంటి సినిమాల్లో నటించింది. తన నటనలో చిలిపితనం, గ్రేస్ ను చూసి.. ఆమెను ఇష్టపడని వ్యక్తులు ఉండరు. నా ఇష్టం సినిమా తర్వాత బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను.. ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. పెళ్లయిన కొన్ని రోజుల తర్వాత సినిమాల్లో క్యామియో రోల్స్ చేసింది. తెలుగు సూపర్ హిట్ గా నిలిచిన మజిలీ మూవీ మరాఠీ రీమేక్ వెర్షన్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో భార్యాభర్తలిద్దరూ కలిసి నటించారు.
ఇప్పుడిప్పుడే బిజీగా మారుతున్న జెనీలియా.. ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ దర్శకుడు తనను టార్చర్ పెట్టాడని.. ఆ దర్శకుడి వల్ల నిద్రలేని రాత్రుల్లు గడిపానని వెల్లడించింది. ఇంతకు ఆ దర్శకుడు మరెవరో కాదు.. బొమ్మరిల్లు భాస్కర్. బొమ్మరిల్లు సినిమా జెనీలియాకి ఎంత మంచి గుర్తింపు తెచ్చిందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో హాసిని పాత్రలో జెనీలియాను తప్ప మరొక హీరోయిన్ ని ఊహించుకోవడం కష్టం. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలోనే ఓ సీన్ కోసం దర్శకుడు భాస్కర్.. ఆమెను మూడు రోజుల పాటు నిద్రపోనీయలేదట. అంతలా తనను టార్చర్ చేశాడని చెప్పింది జెనీలియా. ఇక సినిమా చేయలేనని వదిలి పెట్టి వెళ్లిపోవాలనిపించిందని చెప్పింది జెనీలియా.
ఆ సినిమాలో హీరో సిదార్థ్ తో కలిసి ఐస్ క్రీమ్ తినే సీన్ ఉంటుంది. షూటింగ్ కోసం తనను రప్పించారని.. అయితే రాత్రుళ్లు షూటింగ్ కావడంతో.. ఆ సీన్ సరిగ్గా రాకపోవడంతో మూడు రోజుల పాటు షూటింగ్ చేశారని జెనీలియా చెప్పుకొచ్చింది. అలా మూడు రోజుల పాటు నిద్ర లేకుండా గడిపానని.. భాస్కర్ టార్చర్ భరించలేక షూటింగ్ కు రానని చెప్పి వెళ్లిపోయానని జెనీలియా వెల్లడించింది. రెండు రోజుల పాటు సెట్స్ కు వెళ్ళలేదని.. తన స్నేహితుడు అల్లు అర్జున్ నచ్చజెప్పడంతో తిరిగి షూటింగ్ పూర్తి చేశానని పేర్కొంది. ఇంత కష్టపడ్డారు కాబట్టే ఈ సినిమాలో ఈ సీన్ హైలెట్ గా నిలిచింది. మరి జెనీలియా చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.