iDreamPost
android-app
ios-app

ముకేశ్ అంబానీ కి జగన్ ఆ మాట చెప్పారట!!

ముకేశ్ అంబానీ కి జగన్ ఆ మాట చెప్పారట!!

గతవారం రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తో కలసి ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిసినప్పుడు తనకు ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరానని రాజ్యసభ స్వతంత్ర ఎంపీ పరిమళ్ నత్వాని తెలిపారు. సోమవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో విలేఖరులడిగిన ప్రశ్నకు సమాధానంగా నత్వాన్ని ఈ విషయాన్ని వెల్లండించారు. ప్రస్తుతం తానూ ప్రాతినిధ్యం వహిస్తున్న జార్ఖండ్ నుండి ఉన్న రెండు సీట్లలో ఈ సారి కాగ్రెస్, బిజెపి చెరోక సీటు గెలుచుకొనే అవకాశం ఉండడంతో స్వతంత్ర అభ్యర్థినైన తనకు అవకాశం లభించలేదని ఆయన తెలిపారు.

ముకేష్ అంబానీతో కలసి జగన్ ని కలవడానికిఅమరావతి వచ్చినప్పుడు తానూ ముఖ్యమంత్రితో ఈ ప్రతిపాదన చేశానని పరిమళ్ నత్వాని పేర్కొన్నారు. అయితే బయటివారికి అవకాశం ఇచ్చే సంప్రదాయం తమ పార్టీలో లేదని ముఖ్యమంత్రి జగన్ తమతో చెప్పారని, దీనిపై పార్టీలో చర్చించి 3 రోజులలో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటానని జగన్ తమతో అన్నారని నత్వాని తెలిపారు. ఒకవేళ ఏపీ నుండి అవకాశం దక్కని పక్షంలో ఒరిస్సా, బీహార్, అస్సోమ్ ల్లో ఎక్కడోకచోటనుండి రాజ్యసభ సీటు దక్కించుకొవడానికి పరిమళ్ నత్వాని తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి మంచి మెజారిటీ సాధించడంతో ఈ దఫా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్న నాలుగు ఎంపీ స్థానాలను వైసిపి నే కైవసం చేసుకోనుంది. అంబానీ చేసిన ప్రతిపాదనకు జగన్ ఒకే చెప్పి స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వానికి అవకాశం ఇస్తే మిగిలిన మూడు స్థానాలు వైసిపికి దక్కుతాయి. ఒకవేళ అంబానీ ప్రతిపాదనని జగన్ తిరస్కరిస్తే మొత్తం నాలుగు ఎంపీ స్థానాలు వైసిపి కైవశం చేసుకోనుంది.