iDreamPost
iDreamPost
సరూర్‌నగర్‌లో పరువు హత్య కలకలం రేపింది. సరూర్‌నగర్‌లో పరువు హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. మతాంతర వివాహమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
రంగారెడ్డిజిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన నాగరాజు, అదే గ్రామానికి సమీపంలోని ఘనాపూర్‌లో ఉండే ఆశ్రిన్ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు కాదనడంతో ఈ ఏడాది జనవరి 31న హైదరాబాద్ కివెళ్లి పెళ్లిచేసుకున్నారు.
హైదరాబాద్ లో వాళ్ల అడ్రెస్ కనిపట్టిన ఆశ్రిన్ సోదరుడు, రెక్కీ చేశాడు. తన స్నేహితుడి బైక్ మీద నాగరాజుని వెంబడించిన ఇనుప రాడ్డుతో కొట్టి హతమార్చారు.
మృతుడు నాగరాజు భార్య అశ్రీన్ ఎలా జరిగిందో చెప్పింది. ఇద్దరూ కలిసి బంధువుల ఇంటికి వెళ్తుండగా, భర్తపై అయిదుగురు దాడి చేశారు. వెనకాల నుంచి వచ్చి నాగరాజును బండి మీద నుంచి కిందపడేశారని, నడిరోడ్డుపై ఇనుపరాడ్‌తో దారుణంగా కొట్టి చంపారని తెలిపింది. కాపాడమని గుమిగూడిన వారందరిని కాళ్లు పట్టుకున్నాను. కానీ ఎవరూ ముందుకు రాలేదు. నా భర్తను చంపి అక్కడి నుంచి పరారయ్యారని చెప్పింది.
పదేళ్ల నుంచి నాగరాజుతో నాకు పరిచయం. పెళ్లి చేసుకుంటానంటే చంపేస్తారని నాగరాజుకు చెప్పాను. మూడు నెలల పాటు నాగరాజుతో మాట్లాడలేదు. చివరికి అతని ప్రేమకు ఒప్పుకొని పెళ్లి చేసుకున్నానని అశ్రీన్ వాపోయింది.
సరూర్‌నగర్‌లో పరువు హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. మతాంతర వివాహమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.