iDreamPost
iDreamPost
మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను హైదరాబాద్ పోలీసులకు పట్టుకున్నారు. డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ను బుక్ చేసుకొంటే, ఆ తర్వాత ఆన్ లైన్ కొరియర్ ద్వారా డ్రగ్స్ చెప్పిన అడ్రస్ కు ఈ ముఠా పంపిస్తోందని హైదరాబాద్ కమిషనర్ ఆనంద్ చెప్పారు. వాళ్లతోపాటు 30 మంది డ్రగ్స్ ఆర్డర్ ఇచ్చిన వాళ్లను పట్టుకున్నామని, వాళ్లలో ఇంజనీర్లు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా ఉన్నారని చెప్పారు.
సీపీ సీవీ ఆనంద్ గురువారం మీడియాతో మాట్లాడారు. మతపరమైన వ్యాఖ్యలను సహించేది లేదని, ఇప్పటికే ఇద్దరిపై పీడీయాక్ట్ పెట్టామని చెప్పారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టేవారిని గుర్తించడానికి స్మాష్ – సోషల్ మీడియా యాక్షన్ స్వ్కాడ్‌ను ఏర్పాటు చేశామని, సోషల్ మీడియాలోని ప్రతీ పోస్టుపై నిఘా ఉంటుందని చెప్పారు.
ఆ తర్వాత డ్రగ్స్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. డార్క్‌నెట్ వెబ్‌సైట్ ద్వారా పనిచేసే డ్రగ్స్ ముఠాను పట్టుకున్నామని ఆనంద్ చెప్పారు. ఈ ముఠా క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరుపుతుంది. ఆన్ లైన్ లో డ్రగ్స్ ను బుక్ చేసుకొంటే, ఇంటికి పంపిస్తున్నారు. అందుకే స్టూడెంట్స్ కోసం ఆన్ లైన్ కొరియర్స్ వస్తే పేరెంట్స్ అనుమానించాలి. డ్రగ్స్ ను ఎక్కువగా వాడుతోంది విద్యార్థులే. ఇప్పటికే 600 మందిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చాం. డ్రగ్స్ అమ్మినా, వాడినా కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
డార్క్ వెబ్ ద్వారా మత్తుమందుల పంపణి జరుగుతోంది. విక్కర్ మీ యాప్ ద్వారా గ్రడ్స్ ను ఎంచుకొనే అవకాశాన్ని ఇస్తున్నారు. నచ్చిన మత్తుపదార్ధాన్ని క్లిక్ చేసి, ఆర్డర్ చేసుకోవచ్చు. నకిలీ ఐడీలతో డ్రగ్స్ ను సప్లయ్ చస్తున్నారు. ఈ దందాకు మూలం, ప్రధాన నిందుతుడు గోవాకు చెందిన నరేంద్ర ఆర్య అనే వ్యక్తి. యేడాదిలోనే ఈ యాప్ తో రూ.30 లక్షల మేర లావాదేవీలు చేశాడు. అతన్ని అదుపులోకి తీసుకున్నామని సీవీ ఆనంద్ చెప్పారు. ఇతను ఒక్కడే 450 మందికి డ్రగ్స్ ను సరఫరా చేశాడని తెలిపారు.