Idream media
Idream media
హుజూరాబాద్ ఉప ఎన్నికకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఎన్నికల్లో గెలుపు మాదంటే మాదంటూ అధికార టీఆర్ఎస్, బీజేపీ తీవ్రంగా పోరాడుతుంటే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తామంటున్న ఆ పార్టీ నాయకులు హుజూరాబాద్ లో మాత్రం కనిపించడం లేదు.
కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ ఉప ఎన్నికను లైట్‌గా తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నిక తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికి కసరత్తు చేస్తున్నా… హుజూరాబాద్ పై మాత్రం పెద్దగా ఫోకస్ చేయలేదు.. అయితే వరంగల్‌కు చెందిన మాజీ కొండా సురేఖను అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తున్నా… నేటి వరకు స్పష్టత ఇవ్వలేదు. కొండా సురేఖ పోటి చేయడం ద్వారా అటు పద్మశాలిల ఓట్లతోపాటు మున్నూరు కాపుల ఓట్లను ఆకర్షించవచ్చనే నేపథ్యంలోనే దీటైన అభ్యర్థిగా ఆమెను దింపాలని పార్టీ నిర్ణయించినా ఆమె పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు.కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై ఇంకా చిక్కు ముడి వీడడం లేదు. ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎవరూ పోటీ చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఫైనల్ గా ఖరారు కాకపోవడంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.
Also Read: కుప్పం ఓటమిని మభ్యపెట్టేందుకేనా పవన్ దాడి?
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు. ఇక టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాసయాదవ్ పేరును ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థి విషయంలో ఇంకా నిర్ణయం దిశగానే ఉంది. ఇక్కడ పార్టీ గెలుస్తుందా..? లేదా..? అన్న విషయం పక్కనబెడితే క్యాడర్ ను కాపాడడం కోసం.. పరువు దక్కించుకునేందుక పోటీ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా తరువాత ఆయన బీజేపీలోకి వెళ్లారు. ఆ తరువాత ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అప్పటికే కాంగ్రెస్ పరిస్థితి దిగజారడంతో ఇక్కడ పోటీకి ముందుకు రాదనే అనుకున్నారు. కానీ టీపీసీసీ కొత్త పాలక వర్గం ఏర్పడిన తరువాత హుజూరాబాద్ లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన తరువాత హుజూరాబాద్ ఉప ఎన్నిక సవాల్ గా తీసుకున్నారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ ను బరిలోకి దించితేనే పార్టీ పరువు దక్కుతుందని నిర్ణయించుకున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపు పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. అయితే ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడంతో ఆయనతో పాటు చాలా మంది కాంగ్రెస్ ను వీడారు. దీంతో క్యాడర్ తక్కువైంది. కానీ రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడయ్యాక కొత్త ఉత్సాహం నెలకొంది. అంతేకాకుండా హుజూరాబాద్ బాధ్యతలను దామోదర నర్సింహకు అప్పగించడంతో ఆయన కొన్ని రోజుల కిందట వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. ఒక దశలో చేయి పార్టీ భారీగానే ఓట్లు చీల్చుతుందా..? అన్న చర్చ కూడా ప్రారంభమైంది.
Also Read:రూటు మార్చిన రాహుల్, కాంగ్రెస్‌లోకి కన్హయ్య, జిగ్నేష్
అయితే పార్టీ తరుపున బరిలోకి దిగడానికి ఎవరూ ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. మొదట్లో దామోదర నర్సింహా పేరు వినిపించగా వెంటనే ఆయన ఒప్పుకోలేదు. ఆ తరువాత పొన్నం ప్రభాకర్ ను కలిసి పోటీ చేయాలని కొందరు నాయకులు సంప్రదించారు. కానీ ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయిన పొన్నం మరోసారి ఓడిపోతే కష్టం అని చెప్పినట్లు తెలిసింది. దీంతో మాజీ మంత్రి కొండా సురేఖ ను సంప్రదించారు. కొండా సురేఖ షరతులను ఒప్పుకుంటేనే హుజూరాబాద్ లో పోటీ చేస్తానని తెలిపింది. దీంతో కొందరు సీనియర్ నాయకులు అందుకు ఒప్పుకోలేదు. ఇలా ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడం హుజూరాబాద్ కార్యకర్తలను అయోమయంలో పడేస్తోంది.