Idream media
Idream media
అధికార టీఆర్‌ఎస్ పార్టీ హుజూరాబాద్ ఉప ఎన్నికపై పెడుతున్న శ్రద్ధ బహుసా తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ పెట్టలేదు.హుజూరాబాద్ ఉప ఎన్నిక.. మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్న ఈటల రాజేందర్‌కు చావో రేవో లాంటిది కానీ.. టీఆర్‌ఎస్‌ది ఆ పరిస్థితి కాదు.
ఈ ఉప ఎన్నిక ఫలితం కేసీఆర్ ప్రభుత్వంపైన, 2023లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలపైనా ఏ మాత్రం ప్రభావం పడబోదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండోసారి ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు వివిధ కారణాలతో మూడు ఉప ఎన్నికలు జరిగాయి. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని టీఆర్‌ఎస్ గెలుచుకోగా.. దుబ్బాకలో టీఆర్‌ఎస్ సిట్టింగ్ సీటును బీజేపీ గెలుచుకుంది. నాగార్జున సాగర్‌లో సిట్టింగ్ స్థానాన్ని కారు పార్టీ నిలుపుకుంది.
అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికపై టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఇంత శ్రద్ధ అనేది బహిరంగ రహస్యపాంచజన్యం మరో కథన కలకలం ! ఈసారి అమెజాన్ పై …మే. మంత్రివర్గం నుంచి తొలగిస్తే.. రాజయ్య మాదిరిగా మౌనంగా ఉంటాడులే అనుకుంటే.. ఈటల రాజేందర్ కేసీఆర్‌ను సవాల్ చేశాడు. ఎమ్మెల్యే పదవిని గడ్డిపోచ కింద జమకడుతూ రాజీనామా చేసి ఉప ఎన్నికకు సై అన్నారు. అందుకేనేమో ఈటలను ఎలాగైనా ఓడించాలని గులాబి దళపతి కేసీఆర్ కంకణం కట్టుకున్నట్లు ఉన్నారు.
Also Read :
ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక ముందే… ఈటల రాజీనామా చేసిన వెంటనే.. ఉప ఎన్నికపై దృష్టి పెట్టారు. దళితబంధు పథకాన్ని ప్రకటించారు.హుజూరాబాద్‌లోనే పైలెట్ ప్రాజెక్టుకు అమలు చేస్తామన్నారు. నిధులు కూడా కేటాయించారు. ఇతర పార్టీల నేతలను టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకున్నారు. కాంగ్రెస్ నేత కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ప్రకటించారు. స్థానిక నేతలకే ఎస్సీ కార్పొరేషన్, బీసీ కమిషన్ చైర్మన్ల పదవులు కట్టబెట్టారు. ఇక హుజూరాబాద్‌లో అభివృద్ధి పనులకు వందల కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా మరో హమీని ఇచ్చింది గులాబీ పార్టీ.
ఉప ఎన్నికలో భాగంగా మంత్రి హరీష్‌రావు హుజూరాబాద్‌లో రెడ్లతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన రెడ్డి సామాజికవర్గ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఓ హామీ ఇచ్చారు. త్వరలో తెలంగాణలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు హరీష్‌రావు.హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ గెలుపు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు నాంది పలికేలా ఉండాలంటూ ఓ మెలిక పెట్టారు హరీష్‌రావు. ఉప ఎన్నికలో గెలుపు కోసం కేసీఆర్ అధికారన్ని దుర్వినియోగం చేస్తున్నారని, హామీలు ఇస్తున్నారని వచ్చిన విమర్శలకు.. తమది సన్యాసుల మఠం కాదని, రాజకీయ పార్టీ అంటూ తమ వ్యవహారశైలిని కేసీఆర్ సమర్థించుకున్నారు. ఉప ఎన్నికలో గెలుపు కోసం ఇన్ని హామీలు ఇస్తున్న గులాబీ పార్టీకి ఆశించిన ఫలితం వస్తుందా..? లేదా..? దసరా తర్వాత జరిగే ఓట్ల పండగలో తేలుతుంది.
Also Read : లగడపాటి పొలిటికల్ రీ ఎంట్రీ …?