iDreamPost
android-app
ios-app

Huzurabad By Poll Etela -గెలిస్తే ఈట‌ల‌.. ఓడితే బీజేపీ..!

Huzurabad By Poll Etela -గెలిస్తే ఈట‌ల‌.. ఓడితే బీజేపీ..!

హుజూరాబాద్ ఫైట్ లో గెలుపోట‌ముల సంగ‌తి ప‌క్క‌న‌బెడితే ఈటెల రాజేంద‌ర్, బీజేపీ విష‌యంలో ఆస‌క్తిక‌ర ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి ఈటె‌ల‌, బీజేపీ వేర్వేరు కాదు. బీజేపీ అభ్య‌ర్థి ఈటెలే. అయితే ఇక్క‌డ గెలిస్తే ఈటెల గెలిచిన‌ట్లుగా, ఒక వేళ ఓడితే బీజేపీ ఓడిన‌ట్లు అన్న భావ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. రాజీనామా చేసిన వెంట‌నే రాజేంద‌ర్ పై స్థానికంగా విప‌రీత‌మైన సింప‌తీ వ‌చ్చింది. ఆయ‌న బీజేపీలో చేరాక కాస్త మార్పు మొద‌లైంది. ఇదే అదునుగా అక్క‌డ టీఆర్ఎస్ క్షేత్ర‌స్థాయిలో దూసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ క్ర‌మంలో ఈటె‌ల‌, బీజేపీ గెలుపుపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

తెలంగాణ బీజేపీకి కలిసొస్తున్న ప్రధాన అంశం.. ఆయా నియోజకవర్గాల్లో బలమైన నాయకులు దొరకడమే. తెలంగాణలో పార్టీల కంటే అభ్యర్థలను పట్టించుకుంటారని బీజేపీ నాయకులను చూస్తే అర్థమవుతోంది. పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తలను గెలిపించే సాంప్రదాయం ఎప్పటి నుంచో వస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కావచ్చు.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కావచ్చు.. ఇలా వ్యక్తిగతంగా ఉన్న వారి బలాన్ని బీజేపీ క్యాష్ చేసుకుంటోంది. ఇప్పుడు కూడా బీజేపీకి ఈటెల రాజేందర్ లాంటి అభ్యర్థి దొరకడం కొంత అనుకూలమే. ఓ వైపు రాష్ట్రంలో పట్టు సాధించాలని తపన పడుతున్న బీజేపీకి ఈటెలను గెలిపించుకోవడం అవసరం . అటు ఈటెల రాజేందర్ తాను ఎమ్మెల్యేగా గెలవడం అత్యవసరం. ఈ నేపథ్యంలో ఆయనకు వ్యక్తిగతంగా ఉన్న సెంటిమెంట్ పనిచేస్తుందా..? లేక కేంద్రం నిర్ణ‌యాల‌తో బీజేపీ పై ఇటీవ‌ల క‌నిపిస్తున్న వ్య‌తిరేక‌త ప్ర‌భావం చూపుతుందా అన్న‌ చర్చ సాగుతోంది.

Also Read : By Election Polling Percentage – ఆసక్తికరంగా ఉప ఎన్నికల పోలింగ్‌.. మొదటి మూడు గంటల్లోనే ఓటెత్తారు

దాదాపు ఏ ఉప ఎన్నికకు లేనంతగా మూడు నెలలు ప్రచారం సాగింది హుజూరాబాద్ నియోజకవర్గంలో. ఈటెల రాజీనామా చేసిన తెల్లారి నుంచే అటు ఈటెల రాజేందర్ ఇటు టీఆర్ఎస్ నాయకులు అప్పుడే ఉప ఎన్నిక అన్న విధంగా ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఇప్పటికీ 6 సార్లు ఓడిపోకుండా గెలిచిన ఈటెల మరోసారి గెలుస్తాననే ధీమాతోనే రాజీనామా చేశానని చెప్పాడు. ప్రజలు తనవెంటే ఉన్నారని తనను తప్పకుండా గెలిపిస్తారనే ధీమాతో ఉన్నారు. అయితే మంత్రి వర్గం నుంచి బర్త్ రఫ్ చేయబడ్డ ఈటెల గెలిస్తే పార్టీపై వ్యతిరేకత వస్తుందని అంతేకాకుండా పార్టీ ముఖ్యమని పార్టీ తో ఎవరైనా గెలుస్తారన్న ధీమా టీఆర్ఎస్లో ఉంది.

కొన్ని రోజుల తరువాత టీఆర్ఎస్ గెలవడం అంత సులభం ఏం కాదని తెలిసింది. దీంతో అధికార పార్టీ ప్రత్యేక పథకాలతో పాటు బీసీ వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దింపి ప్రచారం మొదలు పెట్టింది.ఇక మంత్రి హరీశ్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించి గెలిచిపెట్టుకురావాలని కేసీఆర్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. దీంతో నెలరోజులగా హరీశ్ రావు ఇక్కడే మకాం వేశారు. ఎండను సైతం లెక్కచేయకుండా ప్రచారం కొనసాగించారు. అయనతో పాటు మంత్రులు గంగుల కమలాకర్ ,కొప్పుల ఈశ్వర్ఎమ్మెల్యేలు విశ్రాంతి లేకుండా ప్రచారంలో పాల్గొన్నారు. అయితే నియోజకవర్గంలో ఈటెలకు వ్యక్తిగతంగా బలం ఉందని టీఆర్ఎస్ ముందే గ్రహించింది. ఈ నేపథ్యంలో దళిత బంధును ప్రవేశపెట్టింది. అంతేకాకుండా కొన్ని వర్గాలకు ప్రోత్సహాకాలు అందించడంతో ఈటెలను వీడి టీఆర్ఎస్లో చేరారు. దీంతో ఈటెల ఒక్కోసారి గెలుస్తారని ప్రచారం జరిగినా ప్రభుత్వం పథకాలకు ప్రజలు ఆకర్షితులైతే చెప్పలేమంటున్నారు.

Also Read : Badvel By Poll -బద్వేలు ఉప ఎన్నికలు – బీజేపీ తరుపున ఏజెంట్లుగా కూర్చున్న టీడీపీ నేతలు

ఇక ఈటెల గెలుపు ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడమే కాకుండా బీజేపీ భవిష్యత్తును కూడా నిర్ణయించే అవకాశం ఉందని అంటున్నారు. ఈటెల గెలుపుతో ఇక బీజేపీ స్ట్రాటజీ మొదలైందని మరోసారి బీజేపీ నాయకులు ప్రచారం చేసుకునే వీలుంది. అటు ఈటెల సైతం తనకు వ్యక్తిగతంగా బలం ఉందని నిరూపించుకోనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఈటెల గెలుపుకోసం తీవ్రంగా కృషి చేశారు. అయితే అంతకుమించి అన్నట్లు టీఆర్ఎస్ నాయకులు పోటా పోటీగా ప్రచారం చేశారు. మ‌రి ఏం జ‌ర‌గ‌నుందో వేచి చూడాలి.