Swetha
ఇప్పటివరకు సైబర్ నేరగాళ్లలో ఫోన్స్ ట్రాప్ చేసి.. మనీ సంపాదించిన వారిని చూసి ఉంటాం. ఇలా బయట వ్యక్తుల ద్వారా మోసపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ, ఇంట్లో ఉన్న తన భార్య ఫోన్ కాల్స్ విని ఓ వ్యక్తి కొన్ని కోట్లు సంపాదించాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఇప్పటివరకు సైబర్ నేరగాళ్లలో ఫోన్స్ ట్రాప్ చేసి.. మనీ సంపాదించిన వారిని చూసి ఉంటాం. ఇలా బయట వ్యక్తుల ద్వారా మోసపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ, ఇంట్లో ఉన్న తన భార్య ఫోన్ కాల్స్ విని ఓ వ్యక్తి కొన్ని కోట్లు సంపాదించాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Swetha
కోవిడ్ కారణంగా దేశంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వీటిలో ముఖ్యంగా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికి కూడా అనేక సంస్థలలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆనవాయితీలు కొనసాగుతున్నాయి, చాలా సంస్థలు తమ ఎంప్లాయిస్ ను ఆఫీసులకు రమ్మంటున్న సరే ..ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికి అలవాటు పడడం వలన ఆఫీసులకు తిరిగి రావడం లేదు. అయితే, సంస్థలు ఆఫీసులకు రమ్మనడానికి ముఖ్య కారణం .. ఇన్సైడర్ ట్రేడింగ్స్ జరగడం . దీని కారణంగా సంస్థలలో గోప్యంగా దాచిన విషయాలన్నీ కూడా ఇతరులకు తెలిసే అవకాశాలు ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి దొంగచాటుగా భార్య ఫోన్ కాల్స్ విని.. రూ.14 కోట్లు సంపాదించాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అయితే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న తన భార్య అధికారిక ఫోన్ కాల్స్ విని .. ఓ వ్యక్తి భారీ లాభాలు ఆర్జించారు. టేలర్ లౌడన్ అనే వ్యక్తి భార్య బ్రిటిష్ పెట్రోలియం కంపెనీలో పని చేస్తుంది. అయితే భార్యకు తెలీకుండా భర్త లోడన్ ఆమె ఫోన్ కాల్స్ విని ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి.. సుమారు 14 కోట్ల 50 లక్షల రూపాయలను సంపాదించారని ఆ సంస్థ తెలిపింది. ట్రావెల్ సెంటర్స్ అఫ్ అమెరికాను బ్రిటిష్ పెట్రోలియం సంస్థ స్వాధీనం చేసుకుంది. ఇక ఆ సంస్థలో వాటాలు కొనుగోలు విషయాలను లోడన్ తెలుసుకుని దానితో ట్రేడింగ్ చేసినట్లు తెలిసింది. రిమోట్ వర్కింగ్ భార్య నుంచి ఆమెను ఉపయోగించుకుని ఇలా చేసినట్లు ..ఆ అక్కడి అధికారుల విచారణలో బయటపడింది.
కాగా, లోడన్ భార్య బ్రిటిష్ పెట్రోలియం కంపెనీలో మెర్జెస్ అండ్ అక్వసిషన్ కు మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. ట్రావెల్ సెంటర్స్ ను బీపీ కంపెనీ స్వాధీనం చేసుకునే ప్రక్రియలో ఆమె కూడా భాగం అయ్యారు. అయితే, ఈ డీల్ గురించి వార్త అధికారికంగా బయటకు రాకముందే..లోడన్ భార్యకు తెలీకుండా ట్రావెల్ సెంటర్స్ స్టాక్ లోని 46,450 షేర్స్ ను కొనుగోలు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అక్వసిషన్ ప్రకటన తర్వాత .. ట్రావెల్ సంస్థల షేర్స్ ధర 71% శాతం పెరిగింది. ఇక ఆ తర్వాత కొనుగోలు చేసిన అన్ని షేర్స్ ను లోడన్ విక్రయించినట్లు అధికారులు తెలిపారు. అయితే 2022లో ట్రావెల్ సెంటర్స్, బీపీ కంపెనీల మధ్య జరిగిన చర్చలలో.. ఈ విషయాలు బయటపడ్డాయని పేర్కొన్నారు. ట్రావెల్ సెంటర్స్ షేర్స్ కొనుగోలుపై .. పై అధికారులు ప్రశ్నించడంతో .. లోడన్ తన తప్పు ఒప్పుకున్నారు. తన భార్య ఎక్కువ కాలం పని చేయకుండా .. ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించడం కోసమే తానూ ఈ పనిని చేసినట్లు విచారణలో పేర్కొన్నాడు.
అయితే, తన భర్త చేసిన పనికి లోడన్ భార్య ఆశ్చర్య పోయింది. తన భర్త చేసిన పనికి తనకి ఎటువంటి సంబంధం లేదని అధికారులకు నిరూపించేందుకు ఎటువంటి ఆధారాలు లేవు. దీనితో బ్రిటిష్ పెట్రోలియం సంస్థ లోడన్ భార్యను ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే, లోడన్ కు ఆమె భార్య విడాకులు ఇచ్చారని కూడా వార్తలు కూడా వినిపించాయి. ఇక లోడన్ తన తప్పు అంగీకరించిన కారణంగా.. పెనాల్టీతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం, ఉందని పేర్కొన్నారు. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.