Dharani
Dharani
ఏ బంధం అయినా సరే ముందుకు సాగాలన్న.. కలకాలం కొనసాగాలన్న ముఖ్యంగా కావాల్సింది నిజాయతీ, నమ్మకం. అవే లోపిస్తే.. ఆ బంధానికి బీటలు వారతాయి. సమాజం, కట్టుబాట్లు.. ఇవన్ని వదిలేయండి.. మనల్ని నమ్మిన వాళ్లని మోసం చేయకూడదు అనే భావన ఉండటం ఎంతో ముఖ్యం. మనకంటూ కొన్ని విలువలు ఉండాలి. అవి లేని జీవితం పునాది లేకుండా నిర్మించిన భవనం లాంటిది. ఎప్పడైనా కుప్పకూలుతుంది. ఇక ఈమధ్యకాలంలో.. వివాహేతర సంబంధాలకు సంబంధించిన వార్తలు ఎక్కువగా చూస్తున్నాం. ఇలాంటి అనైతిక సంబంధాల కారణంగా అనేక నేరాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రేమ, పెళ్లి, పిల్లలు, కుటుంబం అనే బంధాలను వదిలి.. విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. భర్త కళ్లుగప్పి ప్రియుడితో రొమాన్స్ చేస్తుండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నాడు భర్త. దీని గురించి ప్రశ్నించగా రివర్స్ అయిన మహిళ భర్తనే తిట్టి.. అతడిపై దాడి చేసింది. ఆ వివరాలు..
ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది అనే వివరాలు తెలియవు. ఒక మాల్లో ఈ వీడియోని రికార్డ్ చేశాడు బాధితుడు. భార్య తనకు తెలియకుండా మరో వ్యక్తితో మాల్కి వెళ్లి ఎంజాయ్ చేస్తుండగా.. భర్త సీక్రెట్‌గా వారిని ఫాలో అవుతూ వీడియో తీస్తుంటాడు. మహిళ ఒక షాప్ దగ్గరకు వెళ్లగానే భర్త ఆమె ముందుకు వస్తాడు. సడెన్‌గా భర్తను అక్కడ చూడగానే.. ముందుగా ఆమె షాక్ అవుతుంది. తన ఫ్రెండ్‌తో కలిసి వచ్చానని చెబుతుంది. దాంతో భర్త.. నన్ను మోసం చేసి వీడితో తిరుగుతున్నావా.. చేతిలో చేయి వేసుకుని చక్కర్లు కొడుతున్నావ్.. నువ్వు నాకు అక్కర్లేదు. విడాకులు ఇస్తాను అంటాడు. దాంతో ఆగ్రహించిన మహిళ భర్త దగ్గరకు వచ్చి అతడిపై దాడి చేస్తుంది. పక్కన ఉన్న వాళ్లు ఆపడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆమె మాత్రం ఆగదు. పైగా నాకు నచ్చినట్లు నేను ఉంటాను.. నువ్వేవరు నన్ను అడగటానికి అంటూ అతడిపై రివర్స్ అయ్యింది. దాంతో ఆ వ్యక్తి మీ ఇద్దరి బాగోతాన్ని నేను వీడియో తీశానని అంటాడు.
అంతేకాక పక్కన ఉన్న వారితో తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాడు ఆ వ్యక్తి. తామిద్దరం ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నామని.. కుటుంబ సభ్యులు తమ బంధాన్ని అంగీకరించలేదని తెలిపాడు. ఇక గత కొలంగా తన భార్య కుటుంబ సభ్యులను వేధిస్తుందని వెల్లడించాడు. వీడియోలో ఆ వ్యక్తి చాలా అసభ్యకరమైన భాష వినియోగించాడు. కానీ వీడియో మాత్రం తెగ వైరలవుతోంది. ఇప్పిటికే 13 లక్షలకు మందికి పైగా ఈ వీడియోను చూశారు. చాలా మంది భర్తకు మద్దతు ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె చేసిన పనికి.. ఎవరైనా అలానే చేస్తారు అంటున్నారు.
TW : Extreme Abusive Language
Inappropriate language by husband but when a man is made to do rounds of courts by wife enjoying life with other man, what does he do except taking out frustration? We have seen women beating up a husband when caught with other woman #Adultery https://t.co/a9WT0xzlt6
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) July 21, 2023