iDreamPost
android-app
ios-app

కృష్ణ వరదలు – చిక్కుకుపోయిన వందకుపైగా ఇసుక లారీలు

కృష్ణ వరదలు – చిక్కుకుపోయిన వందకుపైగా ఇసుక లారీలు

అకస్మాత్తుగా పెరిగిన వరదతో ఇసుక కోసం వెళ్లిన లారీలు కృష్ణా నదిలో చిచుక్కుకుపోయాయి. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం చెవిటికల్లు ఇసుక ర్యాంపు నుంచి ఇసుక తీసుకువచ్చేందుకు 132 ఇసుక లారీలు వెళ్లాయి. ఉన్నట్లుండి ఒక్కసారిగా వరద రావడంతో లారీలన్నీ ర్యాంపులోనే నిలిచిపోయయాయి. ఇసుక ర్యాంపులోకి వెళ్లే రహదారి వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో వెనక్కి తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది. పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక విభాగాల సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పడవల ద్వారా ఇసుక లారీల డ్రైవర్లు, క్లీనర్లు, కూలీలను నది నుంచి బయటకు తీసుకువచ్చారు.

వరద తగ్గితే కానీ లారీలను బయటకు తీసుకువచ్చేందుకు అవకాశం లేదు. పులిచింతల ప్రాజెక్టు నుంచి ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టు నుంచి 75 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. మున్నేరు నుంచి మరో ఐదు వేల క్యూసెక్కుల జలాలు కృష్ణాకు చేరుకుంటున్నాయి. మొత్తం 80 వేల క్యూసెక్కుల వరద కృష్ణాకు పోటెత్తుతోంది. పులిచింతల గేట్లు మూసివేసి, దిగువన ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేస్తే గానీ ఇసుక లారీలను బయటకు తీసుకువచ్చే పరిస్థితి లేదు. నిన్న వెళ్లిన లారీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. సమయం గడిచే కొద్దీ లారీలు దెబ్బతింటాయని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక కాంట్రాక్ట్‌ సంస్థ జేపీ పవర్‌ వెంచర్స్‌ ఈ ర్యాంపు నుంచి ప్రతి రోజుల వందల లారీల ద్వారా ఇసుకను రవాణా చేస్తోంది.

Also Read : మూడు పోర్టులు, డజను రహదారులు