iDreamPost
android-app
ios-app

సినిమా క‌థ రాయ‌డమెలా? – 16

సినిమా క‌థ రాయ‌డమెలా? – 16

సినిమా క‌థ‌లో వున్న సౌల‌భ్యం, త‌ల‌నొప్పి ఏమంటే దాన్ని అనేక మందితో షేర్ చేసుకోవాలి, క‌లిసి ప‌నిచేయాలి అంటాడు అలివ‌ర్ స్టోన్‌. ర‌చ‌యిత ద‌ర్శ‌కుడుగా అనేక సినిమాలు తీసిన స్టోన్‌కి ఆస్కార్ అవార్డ్ వ‌చ్చింది. వియ‌త్నాం యుద్ధంలో ప‌నిచేశాడు. ప్లాటూన్ ఒక ర‌కంగా ఆయ‌న ఆత్మ‌క‌థ సినిమానే.

Also Read: సినిమాకి క‌థ రాయ‌డం ఎలా?

కొన్నిసార్లు ఇత‌రుల నుంచి మ‌నం నేర్చుకుంటాం, అన్నిటికి మించి స‌హ‌నాన్ని. సినిమా క‌థ మ‌నిష్టం కాదు. ర‌చ‌యితే ద‌ర్శ‌కుడు అయిన‌ప్ప‌టికీ నిర్మాత‌కి, హీరోకి న‌చ్చాలి. కొన్నిసార్లు హీరో తండ్రికి , వాళ్లింట్లో ప‌నిచేసే వంట వాడికి కూడా న‌చ్చాలి. కొంత మంది రాజీప‌డ‌తారు, కొంద‌రు ప‌డ‌రు. తాము చెప్పిన క‌థ‌ని స్క్రీన్ మీద గుర్తు ప‌ట్ట‌లేని ర‌చ‌యిత‌లు కూడా వున్నారు. అవ‌న్నీ త‌ర్వాత. ముందు క‌థ రెడీ కావాలంటే ఏం చేయాలి.

Also Read: సినిమా క‌థ రాయ‌డమెలా? – 2

జాన‌ర్ ఏదైనా కానీ కామెడీనా, థ్రిల్ల‌రా ఇంకోటా అనేది మ‌ళ్లీ. ముందు ఒక ఇతివృత్తం అనుకోవాలి. సారాంశాన్ని ఐదారు వాక్యాల్లో చెప్ప‌గ‌లగాలి.

మైకెల్ క్రిచ్‌టాన్‌కి ఒక కొత్త ఐడియా వ‌చ్చింది. అంత‌రించి పోయిన డైనోసార్స్‌కి మ‌ళ్లీ జీవం పోస్తే, అవి అదుపు త‌ప్పి ప్ర‌వ‌ర్తిస్తే ఏం జ‌రుగుతుంది. జూరాసిక్ పార్క్ అనే సూప‌ర్‌హిట్ సినిమాగా మారుతుంది.

Also Read: సినిమా క‌థ రాయ‌డ‌మెలా? – 3

ప్ర‌తి సినిమాలో సింపుల్ ఇతివృత్తం వుంటుంది.బాహుబ‌లి – తండ్రికి జ‌రిగిన అన్యాయానికి చిన్నాన్న మీద ప్ర‌తీకారం. రాజ‌రిక‌పు కుట్ర‌ల్లో బాహుబ‌లి మ‌ర‌ణం.

గాడ్ ఫాద‌ర్ – తండ్రిపై కాల్పులు జ‌రిపిన విల‌న్ల‌పై కొడుకు ప్ర‌తీకారం తీర్చుకుని కొడుకు డాన్‌గా మార‌డం.
జాతిర‌త్నాలు – అమాయ‌కంగా సిటీకి వ‌చ్చిన ముగ్గురు కుర్రాళ్లు, ఒక ఎమ్మెల్యే చేతిలో ఇరుక్కుపోవ‌డం

Also Read: సినిమా క‌థ రాయ‌డ‌మెలా? – 4

బ‌యోపిక్‌ల‌కైతే క‌థ ముందే రెడీగా వుంటుంది. మిగిలిన అన్ని క‌థ‌ల‌కి ర‌చ‌యితే ఇతివృత్తాన్ని ఎంచుకోవాల్సిందే. చెత్త క‌థ‌యినా, మంచి క‌థ‌యినా ఇతివృత్తం ఏదో ఒక‌టి వుంటుంది. ఒక సాప్ట్‌వేర్ ఇంజ‌నీర్ ప‌ల్లెకి వ‌చ్చి వ్య‌వ‌సాయం చేయ‌డం. విన‌డానికి ఈ లైన్ చాలా బావుంది. శ్రీ‌కారం సినిమా ఎందుకు ఆడ‌లేదంటే సినిమాలోని రైతు బాధ‌ని మ‌నం ఫీల్ కాలేదు. హృద‌యానికి హ‌త్తుకునే క్యారెక్ట‌ర్లు లేవు. రైతు స‌మ‌స్య‌ల‌పై ద‌ర్శ‌కుడికి అవ‌గాహ‌న లేదు. లోతుగా ఆలోచించ‌లేక పోయాడు. వ్య‌వ‌సాయం ఎందుకు గిట్టుబాటుగా లేదో తెలియాలి. దానికి స‌మిష్టి వ్య‌వ‌సాయం ప‌రిష్కారం కాదు.

Also Read: సినిమా క‌థ రాయ‌డ‌మెలా? – 5

ఇతివృత్తం అనుకున్న త‌ర్వాత ఆ క‌థ‌ని ఎట్లా న‌డ‌పాలి. జాతి ర‌త్నాలు క‌థ‌ని సీరియ‌స్‌గా కూడా తీయొచ్చు. థ్రిల్ల‌ర్‌గా మార్చ‌చ్చు. గాడ్ ఫాద‌ర్ క‌థ‌ని కూడా రాయ‌గ‌లిగితే కామెడీగా రాసుకోవ‌చ్చు. క్యారెక్ట‌ర్ల‌ని మ‌ల‌చ‌డంలో వుంది నేర్పు. Anaylise this, that అని డాన్ కామెడీ సినిమాలున్నాయి. దాన్ని తెలుగులో స‌రిగా అనువాదం చేత‌కాక దేవ‌దాసు తీసారు. మ‌నోళ్లు కాపీ కూడా స‌రిగా కొట్ట‌రు. కౌంట్ ఆఫ్ మాంట్‌క్రిస్టో న‌వ‌లని తెలుగులో రాసిన వాళ్లే కాక తీసిన వాళ్లు వున్నారు. చిరంజీవి “వేట” అదే. క‌థ సంయుక్త మూవీస్ అని వుంటుంది. అలెగ్జాండ‌ర్ డ్యూమా పోయాడు కాబ‌ట్టి బ‌తికిపోయాడు. లేదంటే త‌న సినిమాల్ని తానే చూడాల్సి వ‌చ్చేది.

ఇతివృత్తం ఫిక్స‌యితే జాన‌ర్ కూడా అవుతుంది. ఎమోష‌న్స్‌, కామెడీ, థ్రిల్ల‌ర్‌, స‌స్పెన్స్ హార‌ర్ ఏదైనా కావ‌చ్చు, ఒక్కోసారి అన్నీ క‌లిపి కూడా ఉంటాయి.

Also Read: సినిమా క‌థ‌లు రాయ‌డ‌మెలా? – 6

ప్ర‌ధాన పాత్ర అంటే హీరో. అత‌ని క్యారెక్ట‌ర్ ఏంటి? ఎలా ప్ర‌వ‌ర్తిస్తాడు. మెజార్టీ సినిమా క‌థలు ఫ‌స్ట్ నుంచి లాస్ట్ వ‌ర‌కూ హీరోవే. అత‌ని జ‌ర్నీలో ఎంద‌రు ఎదుర‌వుతారు. స్నేహితులు, శ‌త్రువులు. వీళ్ల‌తో పాటు హీరోయిన్‌. ఒక‌టిరెండు ల‌వ్ సీన్‌లు, పాట‌లు పాడ‌డం త‌ప్ప హీరోయిన్‌కి స్కోప్‌లేని సినిమాలే ఎక్కువ‌.

హీరో వుంటే విల‌నుంటాడు. వీళ్ల బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లేంటి? ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగే డ్రామా ఏంటి? క‌మ‌ర్షియ‌ల్ సినిమాలన్నీ హీరో కండ‌బ‌లం మీదే న‌డుస్తాయి. “ఏసేయండ్రా” అని విల‌న్ పాతిక మందిని ఉసిగొలుపుతాడు. హీరో ఒకొక్క‌న్ని బొరుగుల మూట‌లా విసిరేస్తాడు. “బేరాలేల్లేవ‌మ్మా బొమ్మ ద‌ద్ద‌రిల్లిపోతాది” అని హీరో అరిస్తే ఇంట‌ర్వెల్‌. ఎమోష‌న‌ల్‌గా పాప్‌కార్న్ తిన‌డానికొస్తాం. కానీ కాలం మారుతోంది. అడ‌విరాముడులో ఎన్టీఆర్ బెల్‌బాటం ప్యాంట్ వేసుకుని డాన్స్ చేస్తే ఇవ‌న్నీ ఎట్లా చూసామా అని నా మీద నాకే అనుమానమొస్తుంది. సీతామాల‌క్ష్మీ , ముత్యాల‌ముగ్గు ఇప్ప‌టికి చూసినా అనుమానం రాదు. అవి ఆల్ టైం క్లాసిక్స్‌.

Also Read: సినిమా క‌థ రాయ‌డ‌మెలా? – 7

క‌థ రాస్తున్న‌పుడు ర‌చ‌యిత‌లో ఎమోష‌న్స్ ప‌ల‌కాలి. రాసిన దాని క‌న్నా wastage ఎక్కువుండాలి. ఎక్కాలు రాసిన‌ట్టు రాసుకుంటూ పోతే జ‌నానికి కూడా ఎక్క‌దు. ఏది రాయాలో నిర్ణ‌యం తీసుకోవ‌డ‌మే క‌ష్టం. దాని త‌ర్వాత రాయ‌డం సుల‌భం.

క‌థ‌కి స‌మ‌కాలీన‌త వుంటుంది. ఉమ్మ‌డి కుటుంబాలు ఇంకా వుండాల‌ని క‌థ రాసుకుంటే మూర్ఖ‌త్వం. సీన్స్ ఎంత బాగా రాసుకున్నా నిల‌బ‌డ‌దు. ఆ స‌బ్జెక్ట్ జ‌నాలు మ‌ర్చిపోయారు.

Also Read: సినిమా క‌థ రాయ‌డ‌మెలా? – 8

హీరో కార్మిక నాయ‌కుడ‌ని రాస్తే వేస్ట్‌. ప్ర‌భుత్వాల ద‌య వ‌ల్ల ఇపుడు యూనియ‌న్‌లు లేవు, పోరాటాలు అస‌లే లేవు. జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే మ‌న సినిమాల్లో కార్మికులు అనే వాళ్ల‌ని లేకుండా చేసార‌ని అర్థ‌మ‌వుతుంది. ఇపుడు రాయాల్సింది బ‌త‌క‌డం కోసం చేస్తున్న పోరాటం గురించి. జాతిర‌త్నాలు సినిమాలో అంత‌ర్లీనంగా చెప్పింది అదే. వూరు ఇస్తున్న‌పుడు న‌గ‌రానికెళ్లి త‌న్నులు తిన‌డ‌మెందుక‌ని కామెడీగా చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి