సాంకేతిక కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు లైవ్ ప్రసారం కావడంలేదు. ఈ విషయంపై ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటన చేసింది. నిన్న సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ సమస్య నెలకొంది. సమస్యను పరిష్కరించేందుకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి బొత్సా సత్యనారాయణ కూడా ప్రకటించారు.
అయితే మండలి సమావేశాలు లైవ్ ప్రసారం మాత్రం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ ఇస్తోంది. ఇతర ఏ చానెల్‌లో కూడా మండలి సమావేశాలు ప్రసారం కావడంలేదు. మండలిలో సమావేశాలు సభ లోపల సభ్యులు చూడడానికి ఒక మానిటర్ ఏర్పాటు చేశారు. అజ్ఞాత వ్యక్తులెవరో ఈ మానిటర్‌ని ఫేస్‌బుక్ లైవ్ పెట్టారు. టీడీపీ అధికారిక ఫేస్ బుక్ పేజీ, ఏబీఎన్ చానెల్ ఈ పేజీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఇతర ఏ చానెల్ లో కూడా శాసన మండలి సమావేశాల లైవ్ రాకపోవడం గమనార్హం.