iDreamPost
android-app
ios-app

పవన్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ (OG) ఎలా కుదిరింది?

  • Published Dec 05, 2022 | 5:51 PM Updated Updated Dec 05, 2022 | 5:51 PM
పవన్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ (OG) ఎలా కుదిరింది?

నిన్న ప్రకటించిన పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ సినిమా గురించి సోషల్ మీడియా అభిమానుల మధ్య పెద్ద చర్చే జరుగుతోంది. నిజానికీ కలయిక ఊహించనిది. సాహో డిజాస్టర్ తర్వాత సుజిత్ కొంతకాలం చిరంజీవి లూసిఫర్ రీమేక్ కోసం పని చేశాడు. కానీ అది వర్కౌట్ కాకపోవడంతో తప్పుకున్నాడు. అదే సమయంలో పెళ్లివ్వడంతో కొంత బ్రేక్ తీసుకున్నాడు. ఈలోగా యూవీ సంస్థ నుంచి ఏదో ఒక మంచి ప్రాజెక్టు సెట్ చేస్తామని హామీ దక్కింది. అందుకే ప్రభాస్ చొరవ తీసుకుని రామ్ చరణ్ కు రికమండ్ చేయడం తను చేసే పరిస్థితిలో లేడు కాబట్టి బాబాయ్ దగ్గరకు పంపడం ఊహించని విధంగా గ్రీన్ సిగ్నల్ వచ్చేయడం చకచకా జరిగిపోయాయి

సుజిత్ ఇప్పటిదాకా చేసిందే రెండు సినిమాలు. రన్ రాజా రన్ టైంకి శర్వానంద్ మార్కెట్ చిన్నది. తక్కువ బడ్జెట్లో అది పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత సాహో కోసం ఏళ్ళు కష్టపడినా ఆశించిన ఫలితం దక్కలేదు. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత తన అభిమాన హీరో పవన్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. అందులోనూ డివివి దానయ్య లాంటి బడా ప్రొడ్యూసర్ దొరికాక బడ్జెట్ కు లోటేముంటుంది. తీసుకున్నది గ్యాంగ్ స్టర్ డ్రామా. సరిగ్గా ప్రెజెంట్ చేయాలే కానీ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఈ తరహా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన పంజా, బాలులు ఎంత ఫ్లాప్ అయినా వాటిలో పవన్ మ్యానరిజంస్ ని బాడీ లాంగ్వేజ్ ని అభిమానులు ఇప్పటికీ ఎంజాయ్ చేస్తుంటారు.

అలాంటిది సుజిత్ చేతిలో పడితే ఇంకే రేంజ్ లో ఆన్ స్క్రీన్ రచ్చ ఉంటుందోనని వాళ్ళ ఆలోచన. అసలే వరస రీమేకులతో విసిగిపోయి ఉన్నారు. వకీల్ సాబ్ పాసయ్యింది కానీ పవన్ స్థాయి బొమ్మ కాదది. భీమ్లా నాయక్ కొన్ని ఏరియాల్లో నష్టాలు తెచ్చింది. అందుకే హరిహర వీరమల్లుతో పాటు ఇప్పుడీ సుజిత్ మూవీ మీద బోలెడు ఆశలు పెట్టేసుకున్నారు. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే ట్యాగ్ తో పోస్టర్ ని ఇప్పటికీ విపరీతంగా ట్రెండ్ చేసి నిన్నటి నుంచి నాన్ స్టాప్ గా తిప్పుతూనే ఉన్నారు. OG పదం బాగా వైరల్ అవుతోంది. ఇదంతా బాగానే ఉంది కానీ పవన్ కున్న బిజీ షెడ్యూల్ లో ఇది ఎప్పుడు పూర్తవుతుంది ఎప్పుడు రిలీజవుతుందనేది అంతుచిక్కని ప్రశ్న

Jojobet GirişmeritbetmeritbetjojobetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet giriş