కేసీఆర్‌కు సాధ్యం కానిది.. జగన్‌కు ఎలా సాధ్యమైంది..!

మాది ధనిక రాష్ట్రం అని తరచూ చెప్పే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా దెబ్బ గట్టిగానే తగలింది. ఒక్క తెలంగాణాకే కాదు దేశం యావత్తూ ఆర్థిక వ్యవస్థ స్తంభించడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. నెలకు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే రాష్ట్రాలకు గత మూడు నెలలుగా వందల కోట్ల రూపాయల లోపే రెవెన్యూ సమకూరుతోంది. అందుకే ఉద్యోగులు జీతాల్లో కోతలు, వాయిదాలు వేస్తూ నెట్టుకొస్తున్నాయి. ఇందుకు ఏ రాష్ట్రం కూడా మినహాయింపు కాదు.

ఆంధ్రప్రదేశ్‌ మార్చి, ఏప్రిల్‌ నెల జీతాల్లో కొత వేయగా.. మే నెలకు పూర్తి జీతాలు చెల్లించాలని నిర్ణయించింది. ఇక తెలంగాణలో మార్చి, ఏప్రిల్‌తోపాటు ఈ నెల కూడా ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల భత్యాల్లో కోతలు తప్పవని తేల్చి చెప్పింది. కరోనా వల్ల ఆదాయం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు.

16,500 కోట్ల లోటు బడ్జెట్‌తో మొదలైన రాష్ట్రం, ఆదాయ వనరుల పెద్దగా లేని రాష్ట్రంలో ఓ పక్క సంక్షేమ పథకాల విజయవంతంగా అమలు చేస్తూనే మరో వైపు పరిపాలనను సాఫీగా చేయడం ఏలా సాధ్యమైంది. మొదటిసారి సీఎం అయిన వైఎస్‌ జగన్‌ ఇది ఎలా చేయగలిగారు. రాజకీయాల్లో సీనియర్, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో మంత్రిగా, రెండోసారి ముఖ్యమంత్రిగా పని చేస్తున్న కేసీఆర్‌ చేయలేదని జగన్‌ ఎలా చేశారనే దానిపై ప్రభుత్వ ఉద్యోగుల్లో చర్చ సాగుతోంది.

నాలుగో విడత లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచే ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి స్థాయిలో విధులకు హాజరవుతున్నారు. అంతకు ముందు 20,30 శాతం మంది, అత్యవసర సర్వీసు విభాగాల్లో పూర్తి స్థాయిలో హాజరవుతున్నారు. విధులకు హాజరు కాని సయమంలో జీతాల్లో కోత విధించి, మళ్లీ ఇస్తామని చెప్పినా ఉద్యోగులు అంగీకరించారు. కానీ ఇప్పుడు విధులకు వస్తున్నారు. పని చేసిన వారికి జీతం ఇవ్వాల్సిందే అని సీఎం జగన్‌ నిర్ణయానికి వచ్చినట్లుగా ఉన్నారు. అందుకే ఏపీలో ఈ నెల జీతం జూన్‌ ఒకటో తేదీన పూర్తిగా ఉద్యోగుల ఖాతాల్లో పడనుంది.

Show comments