iDreamPost
iDreamPost
ఇంకా గాడ్ ఫాదర్ పూర్తి కాకుండానే మెగాస్టార్ చిరంజీవి తన లైనప్ ని వేగవంతం చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే భారీ చిత్రం రెగ్యులర్ సెట్స్ పైకి వెళ్లకుండానే తాజాగా భోళా శంకర్ ని స్టార్ట్ చేశారు. అంగరంగ వైభవంగా పరిశ్రమ అతిరథ మహారథులు విచ్చేయగా తొలి షాట్ కి కె రాఘవేంద్ర రావు క్లాప్ ఇచ్చారు. హీరోయిన్ తమన్నా వచ్చింది. ఈ సందర్భంగా క్యాస్టింగ్ ప్రకటించారు. కీర్తి సురేష్, రఘుబాబు, రావు రమేష్, మురళి శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శీను ఇందులో తారాగణంగా భాగం వహిస్తున్నారు.
ఛాయాగ్రహణ బాధ్యతలు డూడ్లే నిర్వహిస్తుండగా ఇంతకు ముందే ట్యూన్స్ కంపోజింగ్ లో బిజీ అయిన మహతి స్వర సాగర్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా ఇదే పెద్ద ప్రాజెక్ట్ కానుంది. స్టోరీ సూపర్ విజన్ సత్యానంద్ చేస్తుండగా రామ్ లక్ష్మణ్-దిలీప్ సుబ్బరాయన్-కేచాలు ఫైట్స్ ని సెట్ చేస్తున్నారు. వీళ్ళతో మిగిలిన సాంకేతిక నిపుణలను కూడా రివీల్ చేశారు. మొత్తానికి మెహర్ రమేష్ చాలా నీట్ గా టీమ్ ని సెట్ చేసుకున్నాడు. వేదాళం రీమేక్ గా రూపొందుతున్న ఈ యాక్షన్ కం సెంటిమెంట్ డ్రామాలో కీర్తి సురేష్ చిరుకి చెల్లిగా నటించనుంది. భోళా శంకర్ విడుదల వచ్చే ఏడాది దసరా లేదా దీపావళికి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మెహర్ రమేష్ కి ఈ హిట్ చాలా కీలకం. శక్తి, షాడో లాంటి డిజాస్టర్లతో హీరోలు తనను చూడటం మానేసిన తరుణంలో కెరీర్ ఏమవుతుందో అర్థం కాని టైంలో చిరు ఈ ఆఫర్ ఇచ్చాడు. దీన్ని ఉపయోగించుకోవడం అతని చేతిలోనే ఉంది. కాకపోతే వేదాళం రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్. మనం ఎప్పుడూ చూడని కథాకథనాలు ఏమి ఉండవు. కాకపోతే మాస్ కి కనెక్ట్ అయ్యే అంశాలు హీరోయిజం పుష్కలంగా ఉంటాయి. వీటిని కనక సరిగ్గా పొందుపరిస్తే ఖైదీ నెంబర్ 150 లాగా విజయం దక్కొచ్చు. ఆచార్య ఫిబ్రవరిలో విడుదల కానుండగా భోళా శంకర్, బాబీ ప్రాజెక్ట్ రిలీజులు ఎప్పుడు ఉంటాయో ఇంకా తెలియాల్సి ఉంది
Also Read : Kurup : ఈ విషయంలో మెచ్చుకోవాల్సిన మలయాళం హీరో