Idream media
Idream media
తన బాధ ప్రపంచం బాధ అని ఓ కవి అన్నట్లుగా ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు తీరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను రాయలేని భాషలో టీడీపీ నేతలు ఇటీవల దూషిస్తున్నారు. నిన్న మంగళవారం ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో సీఎం వైఎస్ జగన్‌ను మరోసారి దూషించారు. దీంతో కోపోద్రిక్తులైన వైఎస్ జగన్ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలోకి కొంత మంది దూసుకెళ్లారు.
దీనిపై నిన్నటి నుంచి నానా హంగామా చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే బంద్‌కు ప్రజల నుంచి స్పందన రాలేదు. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించిన తీరు బాబుకు చెంపపెట్టులా మారింది. ఇది ప్రజల సమస్య కాదని, రెండుపార్టీల మధ్య సమస్యపై చేస్తున్న బంద్‌కు తాము మద్ధతు తెలపలేమని స్పష్టం చేస్తూ.. ప్రకటన విడుదల చేసింది.
టీడీపీ బంద్‌కు విజయవాడతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, వ్యాపార వర్గాల నుంచి సహకారం లేకపోవడంతో చంద్రబాబుకు చిర్కెత్తుకొచ్చినట్లు కనిపిస్తోంది. మళ్లీ మీడియా ముందుకు వచ్చిన ఆయన.. తమ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి.. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఇది టీyీ పీ సమస్య కాదని ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల సమస్య అంటూ చెప్పుకొచ్చారు. ప్రజలు స్పందించకపోతే వాళ్లే నష్టపోతారంటూ శాపనార్థాలు పెట్టారు.
Also Read : Chandrababu U Trun On Bandh-ఏపీ బంద్, మళ్లీ బాబుది యూటర్న్. ఆయన మాటల్లో నాడు-నేడు
చంద్రబాబు మాటలు విన్న వారికి ఆయన అనుభవం ఇదేనా..? అనిపిస్తోంది. టీడీపీ సమస్యను రాష్ట్ర ప్రజల సమస్యగా చిత్రీకరించేందుకు ఆయన పడుతున్నపాట్లు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈ పరిస్థితి అంతటికీ కారణం.. రాష్ట్ర ముఖ్యమంత్రిని టీడీపీ నేతలు దూషించడం. మూడు సార్లు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు.. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని దూషించకూడదనే విషయం తెలియదా..? ఒకసారి కాదు.. పదే పదే అసభ్యకరమైన భాష వాడుతూ దూషిస్తుంటే తన పార్టీ నేతలను వారించాల్సిన బాధ్యత చంద్రబాబుపై లేదా..? దూషించడం వల్ల ఆ దూషణలు ఎదుర్కొన్న నేత అభిమానులకు, శ్రేణులకు ఆగ్రహం రాదా..? ఆ పరిణామాల వల్ల సమస్య వస్తే.. అవి టీడీపీ సమస్య కాకుండా.. రాష్ట్ర ప్రజల సమస్య ఎలా అవుతుందో దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడనని చెప్పుకునే చంద్రబాబే సెలవివ్వాలి.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తిట్టించడం వల్ల జరిగే పరిణామాలను బేస్ చేసుకుని తాను ఏ డిమాండ్‌ను అయితే తెరపైకి తీసుకురావాలనుకున్నారో చంద్రబాబు.. దాన్ని తన నోట నుంచి ఈ రోజు పలికారు. లోకేష్, అయ్యన్నపాత్రుడులు దూషించినప్పుడు చంద్రబాబు లక్ష్యం నెరవేరలేదు. కానీ పట్టాభి చేసిన దూషణల తర్వాత.. చంద్రబాబు అనుకున్న లక్ష్యం నెరవేరింది. ఇరు పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలను చెబుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య వచ్చిందని, తక్షణమే ఆర్టికల్ 356 (రాష్ట్రపతి పాలన) పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ పరిస్థితులు ఆర్టికల్ 356 పెట్టేవిగా తనకు అనిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు. తనకే అలా అనిపిస్తే.. దేశంలో తనకన్నా జూనియర్ నేతలైన వారికి అలా అనిపించడం లేదా..? అనేది చంద్రబాబు భావన కాబోలు.
అధికార పీఠంపై కూర్చోవాలని ఊవ్వీళ్లూరుతున్న చంద్రబాబు.. వైసీపీ అధికారంలోకి వచ్చినపుపటి నుంచీ అనేక శాపనార్థాలు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం ఉండేది రెండేళ్లే.. ఈ ప్రభుత్వం కూలిపోతుంది.. ఒన్‌టైమ్ సీఎం.. ఇలా రకరకాలుగా చంద్రబాబు ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. అధికారంలోకి రావాలంటే… ప్రజల మనసులు గెలుచుకోవాలి గానీ.. ముఖ్యమంత్రిని తిడితే అధికారం రాదన్న విషయం చంద్రబాబు ఎప్పుడు తెలుసుకుంటారో..?
Also Read : YS Jagan – ఓర్వలేక ప్రతిపక్షం వైషమ్యాలు.. మంచి చేయడం ఆపనన్న జగన్