iDreamPost
android-app
ios-app

అఖిల్ కోసం హాలీవుడ్ ఫార్ములా

  • Published Sep 10, 2020 | 10:05 AM Updated Updated Sep 10, 2020 | 10:05 AM
అఖిల్ కోసం హాలీవుడ్ ఫార్ములా

నిన్న సురేందర్ రెడ్డితో ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కన్నా దీని గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు అభిమానులు. తమ హీరోకు ఐదేళ్లుగా అందని ద్రాక్షగా మిగిలిన సక్సెస్ ని సూరి బంగారు పళ్లెంలో ఇస్తాడని గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా ఏవేవో అంచనాలతో కేవలం ప్రేమకథలు మాత్రమే చేస్తూ వచ్చిన అఖిల్ ఎట్టకేలకు జానర్ ని మార్చుకోవాలని నిర్ణయించుకోవడం మంచి విషయమే. అయితే ఈ సబ్జెక్టుకు సంబంధించి అప్పుడే లీకులు షికారు చేస్తున్నాయి. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ యాక్షన్ సిరీస్ ‘బార్న్ ఐడెంటిటీ’ తరహాలో అవుట్ అండ్ అవుట్ హై వోల్టేజ్ లో ఇది సాగుతుందట.

ఇందులో అఖిల్ సూపర్ కాప్ గా నటించడంతో పాటు వివిధ దేశాల్లో చేసే విన్యాసాలు భారీ ఎత్తున ప్లాన్ చేయబోతున్నారట. అందుకే మార్కెట్ తో సంబంధం లేకుండా సురేందర్ రెడ్డి మీద నమ్మకంతో 40 కోట్లకు పైగా బడ్జెట్ ను సిద్ధం చేసినట్టు వినికిడి. హీరో ఇమేజ్ పరంగా చూసుకుంటే ఇది సాహసమే కానీ నిజంగా కంటెంట్ లో దమ్ముంటే ఆ మొత్తం వెనక్కు రావడం పెద్ద విషయం కాదు. అందులోనూ పాన్ ఇండియా లెవెల్ లో కూడా డిజైన్ చేస్తున్నారట. ఇదే కనక జరిగితే హింది ప్లస్ డబ్బింగ్ మార్కెట్ రూపంలో మంచి మొత్తం నిర్మాత చేతికి అందుతుంది.

గూడచారి తర్వాత తెలుగులో చెప్పుకోదగ్గ స్పై థ్రిల్లర్స్ రాలేదు కాబట్టి ఇది కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకాన్ని యూనిట్ వ్యక్తపరుస్తున్నట్టుగా తెలిసింది.
హీరొయిన్ మిగిలిన తారాగణం వివరాలు త్వరలో బయట పెట్టబోతున్నారు. అఫీషియల్ గా చెప్పలేదు కానీ దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నట్టు సమాచారం. దీని నిర్మాణానికి ఏడాది దాకా పట్టొచ్చని తెలిసింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాలన్స్ ని పూర్తి చేశాక సురేందర్ రెడ్డి సినిమా సెట్స్ పైకి తీసుకెళ్తారు. అఖిల్ మాత్రం దీని పట్ల బాగా ఎగ్జైటింగ్ గా కనపడుతున్నాడు. సైరా లాంటి హిస్టారికల్ మూవీ తర్వాత కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ కొట్టాలనే టార్గెట్ తో ఉన్నాడు సురేందర్ రెడ్డి. అదే జరిగితే అటు అఖిల్ కోరుకున్నది కూడా జరిగిపోతుంది ఒకే దెబ్బకు రెండు పిట్టల తరహాలో