iDreamPost
android-app
ios-app

నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో కుడా హై టెన్షన్

నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో కుడా హై టెన్షన్

ప్రశాంతంగా ఉన్న నెల్లూరు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లాలో ఢిల్లీ మత సమావేశం తాలూకు ప్రకంపనలు తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. దీంతో నెల్లూరు నగరం హైఅలర్ట్‌ అయ్యింది. నగరంలోని రెండు డివిజన్లను రెడ్‌ జోన్లుగా అధికారులు ప్రకటించారు.

దేశ వ్యాప్తంగా పాజిటివ్‌గా ధ్రువీకరించిన కేసులన్నీ డిల్లిలొనీ నిజాముద్దీన్ మర్కజ్ సమావేశానికి హాజరైన వారివే కావడంతో ఆ సమావేశానికి జిల్లా నుంచి 34 మంది హాజరు కావడంతో ఒక్కసారిగా జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. దీనికి సంభందించి అధికారులు మూడు, నాలుగు రోజులకు ముందే వీరిలో చాలామందిని ఆసుపత్రులకు, హౌస్‌ ఐసొలేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి హాజరైన వారిలో కొంత మందికి తాజాగా కరొనా పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది.

దీంతో జిల్లా నుంచి వెళ్లి వచ్చిన వారి పరిస్థితి ఏమిటనే ఆందోళన అన్ని వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అనుమానితుల స్వాబ్‌ రిపోర్టుల తాలుకు ఫలితాలు మంగళవారం రాత్రికి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వీరిలో పాజిటివ్‌ కేసులుంటే మాత్రం మరింత అప్రమత్తం కావాల్సి ఉంది.

వీరు ఎవరెవరిని కలిశారో వారందరిని గుర్తించి హోమ్‌ ఐసొలేషన్‌కు తరలించాలి. ఈ విషయమై అధికారుల్లో, ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. నెల్లూరు నగర పరిధిలో ఇలాంటి ప్రమాదం ఏదైనా జరిగి ఉంటుందనే అనుమా నంతో 43,47 డివిజన్లను రెడ్‌ జోన్లుగా కలెక్టర్‌ ప్రకటించారు. అక్కడివారు ఇంటి నుంచి బయటకు రాకుండా నిత్యావసర వస్తువులను ఇళ్ల వద్దకే అందజేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కూడా ఢిల్లీ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన 26 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. తాజాగా వారిలో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. మిగిలిన 23 మందికి నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన ముగ్గురు వ్యక్తుల కుటుంబ సభ్యులతో పాటు కాంటాక్ట్ అయిన వారిని అధికారులు గుర్తించారు. రాజమండ్రిలో పాజిటివ్ వ్యక్తి కుటుంబ సభ్యులు 16 మందితో పాటు కాంటాక్ట్ అయిన మరో ఎనిమిది మందిని అధికారులు గుర్తించారు.

కాకినాడ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఐదుగురు కుటుంబ సభ్యులతో పాటు కాంటాక్ట్ అయిన 61 మందిని అధికారులు గుర్తించారు. పెద్దాపురం పాజిటివ్ వ్యక్తి కుటుంబ సభ్యులు ఆరుగురితో పాటు కాంటాక్ట్ అయిన 53 మందిని కూడా అధికారులు గుర్తించారు.

కాకినాడ పాజిటివ్ వ్యక్తి కుటుంబ సభ్యులకు కరోనా నెగిటివ్‌గా నిర్థారణ అయ్యింది. జిల్లాలో 68 మంది రిపోర్టులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకూ నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాజమండ్రి, కాకినాడ, పెద్దాపురంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు