Idream media
Idream media
రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెప్తూ ప్రజలకు అండగా ఉంటామనే మాట చెప్తూ, అత్యాచారాలు, హత్యలు పెరిగాయనే మాట చెప్తూ నిరసన కార్యక్రమాలకు టీడీపీ పిలుపునిస్తూ వస్తుంది. రాజకీయంగా ఆ పార్టీకి ఈ పిలుపులు ఎంతవరకు కలిసి వస్తున్నాయి ఏంటీ అనేది తెలియకపోయినా సరే నిర్వహిస్తున్న కార్యక్రమాలు మాత్రం వివాదాస్పదం అవుతున్నాయి. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నుంచి మహిళా నేతల వరకు అందరూ ఇప్పుడు కొన్ని ప్రోత్సహించడం సంచలనం అయింది.
పార్టీ ఆఫీసు మీద దాడి జరిగింది అని చెప్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కార్యాలయంలో నిరసనకు దీక్షకు దిగారు. 48 గంటల పాటు ఆయన అక్కడ దీక్ష చేశారు. ఆ దీక్షకు పార్టీ కార్యకర్తల నుంచి మంచి స్పందన వచ్చిందని టీడీపీ అనుకూల మీడియా ప్రసారం చేసే లోపే ఒక వీడియో వివాదాస్పదం అయింది. 2019 ఎన్నికల కోసం బీసీ ఓటర్లను ఆకట్టుకోవడానికి జై హో బీసీ అనే సాంగ్ రాశారు. ఈ సాంగ్ ను టీడీపీ కార్యకర్తలు బాగానే రిసీవ్ చేసుకున్నారు. ఈ పాటను ఆ నిరసన దీక్షలో ప్లే చేశారు.
అక్కడ ఒక మహిళా కార్యకర్త ఈ పాటకు డాన్స్ వేయడం సంచలనం అయింది. చంద్రబాబు ఉండగానే ఈ పాటకు డాన్స్ వేయడం, ఆ వీడియో వైరల్ కావడం పట్ల భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఇక చంద్రబాబు దీక్షను అక్కడి వాళ్ళే కామెడీ గా తీసుకునే పరిస్థితి వచ్చింది. ఈ పాట విషయంలో బీసీ లు కూడా ఇబ్బంది పడ్డారని టీడీపీ ఐటెం సాంగ్ గా మార్చేశారు అని ఆవేదన వ్యక్తమైంది. ముందు పాటకు మంచి స్పందన వచ్చినా సరే ఈ తరహాలో డాన్స్ లు వేయడంతో వివాదాస్పదం అయింది.
ఇక తాజాగా మహిళలకు అన్యాయం జరుగుతుందని చెప్తూ ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సారథ్యంలో ఒక కార్యక్రమం జరిగింది. నారీ అనే పేరుతో జరిగిన ఈ కార్యక్రమాన్ని టీడీపీ సీరియస్ గా తీసుకుంది. అయితే కార్యక్రమంలో చివర్లో ఆ పాట ప్లే చేశారు. చేస్తే చేశారు గాని డాన్స్ లు వేయడంతో ఈ పాట వివాదాస్పదం అయింది. విజయవాడలో ఒక యువతి ప్రాణాలు కోల్పోయి గర్భశోకంలో ఉన్న తరుణంలో ఇలా డాన్స్ లు వేయడం పట్ల టీడీపీలోనే విమర్శలు వస్తున్నాయి. ఆ పాట పరువు తీశారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.