iDreamPost
android-app
ios-app

వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటనను సూమోటో గా స్వీకరించిన హై కోర్టు

  • Published May 07, 2020 | 11:32 AM Updated Updated May 07, 2020 | 11:32 AM
వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటనను సూమోటో గా స్వీకరించిన హై కోర్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ లో ఈరోజు తెల్లవారుజామున స్టైరిన్ గ్యాస్ లీకేజీ కారణంగా 9 మంది మృతి, వందల మంది అనారొగ్య పాలవడంతో హైకోర్టు ఈ కేసుని సూమోటో గా తీసుకుంది. జన బాహుళ్యం మద్యన ఇలాంటి ప్రమాదకరమైన కెమికల కెంపెని ఎలా ఉందని ప్రశ్నించింది, ఈ ఘటనకు సంభందించి రాష్ట్ర కెంద్ర ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని నోటిసులు జారీ చేసి విచారణ వాయిదా వేసింది .

అలాగే జాతియ మానవ హక్కుల కమిషన్ కూడా మీడియా లో వచ్చిన కధనాలు ఆదారంగా ఈ కేసును సుమోటో కాగ్నిజెన్స్ గా తీసుకుంది. ఈ కేసులో మానవ తప్పిదం కాని లేదా నిర్లక్ష్యం కానీ ఉన్నాయా అని , రెస్క్యు ఆపరషన్ లో మానవ హక్కుల ఉల్లంగన ఏమైన జరిందా అని, 9మంది అమాయక ప్రజల ప్రాణాలు కోల్పొవడానికి కారకులు ఎవరనేది తెలాలని దీనిపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించాలని నోటీసులు జారీ చెసింది