Aditya N
టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని చాలా కాలంగా పాన్-ఇండియా మార్కెట్‌ను స్థాపించడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ఆయన నటించిన హాయ్ నాన్న సినిమాతో ఆ స్థానాన్ని భర్తీ చేశారు. అదెలాగంటే..
టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని చాలా కాలంగా పాన్-ఇండియా మార్కెట్‌ను స్థాపించడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ఆయన నటించిన హాయ్ నాన్న సినిమాతో ఆ స్థానాన్ని భర్తీ చేశారు. అదెలాగంటే..
Aditya N
నాచురల్ స్టార్ నాని నటించిన ఎమోషనల్ డ్రామా హాయ్ నాన్న గతేడాది డిసెంబర్ లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే జనవరి మొదటి భాగంలో ఓటీటీలో విడుదలైన ఈ సినిమా మరింత క్రేజ్ ను తెచ్చుకుంది. హిందీలో హాయ్ పాపా అనే పేరుతో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అంత పెద్ద విజయం సాధించలేదు. అయితే నెట్ ఫ్లిక్స్ లో విడుదలయిన తరువాత మాత్రం హాయ్ నాన్న హిందీ వెర్షన్ కు హిందీ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారనే చెప్పాలి.
నాని చాలా కాలంగా పాన్-ఇండియా మార్కెట్‌ను స్థాపించడానికి ప్రయత్నిస్తున్నారు. శ్యామ్ సింఘా రాయ్ నుండి, అయన తన చిత్రాలను అన్ని భాషలలో విడుదల చేస్తూ వస్తున్నారు. అలాగే ప్రమోషన్స్ పరంగా కూడా మంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ, నాని గత సినిమాలు హిందీ వెర్షన్లలో ఆశించిన ఫలితాన్ని పొందలేదు. కానీ, హాయ్ నాన్నతో, నాని ఎట్టకేలకు హిందీలో భారీ బ్రేక్ అందుకున్నారు. హాయ్ నాన్న హిందీ వెర్షన్ హాయ్ పాపా నెట్‌ఫ్లిక్స్‌లో మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్‌తో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం ఉత్తరాది ప్రేక్షకులకు బాగా నచ్చింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతమైన అభిమానాన్ని అందుకుంటుంది.
ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైనప్పటి నుండీ ట్రెండింగ్‌లో ఉంది. కాగా తెలుగు వెర్షన్ ఇప్పుడు ట్రెండింగ్‌లో లేనప్పటికీ, మిగతా కొత్త చిత్రాలు కూడా అదే ప్లాట్‌ఫారమ్‌లో వచ్చినప్పటికీ హిందీ వెర్షన్ ఇప్పటికీ టాప్ 10లో ఉంది. హిందీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చాలా బాగా ఆదరించారు. నాని తన హార్డ్ వర్క్ తో పాటు చక్కని కంటెంట్ తో సినిమాలు చేయడం వల్ల తగిన గుర్తింపుతో పాటు విజయాన్ని కూడా అందుకున్నారు. ఈ ఫలితం ఇప్పటికే తన తదుపరి ప్రాజెక్ట్ అయిన సరిపోదా శనివారం వ్యాపారానికి సహాయపడింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ 45 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.