iDreamPost
android-app
ios-app

పుష్ప తర్వాత సినిమా లాక్ అయినట్టే

  • Published Sep 08, 2021 | 4:54 AM Updated Updated Sep 08, 2021 | 4:54 AM
  • Published Sep 08, 2021 | 4:54 AMUpdated Sep 08, 2021 | 4:54 AM
పుష్ప తర్వాత సినిమా లాక్ అయినట్టే

పుష్ప పార్ట్ 1 తర్వాత అల్లు అర్జున్ గ్యాప్ తీసుకోవడం ఖాయమే. రెండు భాగాలు వెంటవెంటనే వచ్చే ఛాన్స్ లేదని తేలిపోయింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో బన్నీ వాసు చెప్పినట్టు మధ్యలో ఐకాన్ రూపొందనుంది. ఇది ఎప్పుడో ఓకే చేసుకున్న ప్రాజెక్టు అయినప్పటికీ రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. వకీల్ సాబ్ ని దర్శకుడు వేణు శ్రీరామ్ రూపొందించిన విధానం బన్నీకి బాగా నచ్చడంతో ఇక జాప్యం లేకుండా ఐకాన్ ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. పూజా కార్యక్రమాలు ఎప్పుడు చేసినా రెగ్యులర్ షూటింగ్ మాత్రం డిసెంబర్ లోనే ఉంటుందని యూనిట్ వర్గాల నుంచి అందుతున్న వార్త.

దీనికి సంబంధించిన మరొక క్రేజీ అప్ డేట్ చక్కర్లు కొడుతోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. పూజా హెగ్డే, కృతి శెట్టి పేర్లను సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు వినికిడి. ఇప్పటికే స్టోరీ నేరేషన్ అయ్యిందని సమాన ప్రాధాన్యం ఉండటంతో పాజిటివ్ సిగ్నల్స్ వచ్చాయని అంటున్నారు. అఫీషియల్ కన్ఫర్మేషన్ రావడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. ఉప్పెన దెబ్బకు డిమాండ్ అమాంతం పెరిగిన కృతి శెట్టి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. సుధీర్ బాబు, నాని, రామ్ ల సరసన ఇప్పటికే జోడి కట్టేసింది. ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ అంటే డబుల్ ప్రమోషన్ వచ్చినట్టే. సరిగ్గా క్లిక్ అయ్యిందా టాప్ 3 చోటు ఫిక్స్.

ఇక పూజా హెగ్డే సైతం బన్నీ కాంబినేషన్ అంటే సంతోషంగా ఒప్పుకుంటుంది. తన కెరీర్ కు పెద్ద బ్రేక్ ఇచ్చిన డిజె దువ్వాడ జగన్నాధం హీరోగా తన మీద స్పెషల్ కార్నర్ ఉంది. దానికి తోడు అల వైకుంఠపురములో రూపంలో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కూడా ఖాతాలో ఉంది. సో ఎలా చూసుకున్నా మంచి నిర్ణయం అవుతుంది. పుష్ప మొదటి భాగాన్ని నవంబర్ లోగా పూర్తి చేసి కొంత రెస్ట్ తీసుకున్నాక అల్లు అర్జున్ ఐకాన్ కోసం బిజీ అయిపోతాడు. ఇప్పటికే రెండేళ్ల గ్యాప్ అవుతుంది కాబట్టి ఐకాన్ ని కూడా 2022 సమ్మర్ లేదా దసరా లోగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. పుష్ప 2 రిలీజ్ 2023లో ఉంటుంది

Also Read: భయపెట్టబోతున్న అక్కినేని హీరో

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet