భయపెట్టబోతున్న అక్కినేని హీరో

By iDream Post Sep. 07, 2021, 12:30 pm IST
భయపెట్టబోతున్న అక్కినేని హీరో

కరోనాతో వచ్చిన లాక్ డౌన్ వల్ల కలిగిన ప్రయోజనం ఓటిటిలకు అంతా ఇంతా కాదు. వాటి మార్కెట్ అమాంతం పెరిగిపోవడమే కాక ఏకంగా ఒక సినిమాకు అయ్యేంత బడ్జెట్ ని కేవలం హక్కుల కోసం పెట్టుబడిగా పెట్టే స్థాయికి చేరుకున్నాయి. అందుకే వెంకటేష్, నాని,అనుష్క , విజయ్ సేతుపతి లాంటి స్టార్ మూవీస్ కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజులు అందుకున్నాయి. ఇది కేవలం ఇక్కడికే పరిమితం కాలేదు. వెబ్ సిరీస్ లకు కూడా మంచి డిమాండ్ వస్తోంది. ఇప్పటికే కొందరు సీనియర్ హీరోయిన్లు ఈ బాట పట్టేశారు. తమన్నా, కాజల్ అగర్వాల్, అమలా పాల్, శృతి హాసన్, సాయిపల్లవి ఇలా లిస్టు చాంతాడంత ఉంది. మరికొందరు క్యూలో ఉన్నారు.

వీళ్ళ సంగతలా ఉంచితే ఇప్పుడున్న యూత్ హీరోలు మాత్రం ఇంకా వెబ్ సిరీస్ ల వైపు సీరియస్ గా ఆలోచించడం లేదు. ముందుగా నాగ చైతన్యనే ఆ అడుగు వేస్తున్నట్టు సమాచారం. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందబోయే ఓ హారర్ థ్రిల్లర్ ని నార్త్ స్టార్ బ్యానర్ మీద శరత్ మరార్ నిర్మించబోతున్నారు. చైతు విక్రమ్ కాంబోలో ఇప్పటికే థాంక్ యు సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దాదాపు పూర్తయ్యే స్టేజిలో ఉంది. ఇది నిర్మాణంలో ఉన్నప్పుడే వెబ్ సిరీస్ తాలూకు కథా చర్చలు ప్రతిపాదనలు అన్నీ ఓకే కావడంతో అదే ఫ్లోలో దీన్ని కూడా చేసేస్తున్నారని తెలిసింది. బడ్జెట్ కూడా భారీగా ఉండబోవడం లేదట.

డిసెంబర్ 8ని స్ట్రీమింగ్ డేట్ టార్గెట్ గా పెట్టుకుని దానికి అనుగుణంగా షెడ్యూల్ చేసుకున్నారని వార్త. ఒక్కొక్కటి నలభై నిమిషాల పాటు సాగే ఎనిమిది ఎపిసోడ్లతో ఆద్యంతం ఇది థ్రిల్లింగ్ గా ఉంటుందని సమాచారం. సెన్సిటివ్ సబ్జెక్టులను ఎక్కువగా డీల్ చేస్తాడని పేరున్న విక్రమ్ కుమార్ హారర్ ని ఎలా ప్రెజెంట్ చేస్తాడనే అనుమానం అక్కర్లేదు. తన డెబ్యూ మూవీ 13B తో హిందీ తమిళ తెలుగు ఆడియన్స్ ని ఏకకాలంలో భయపెట్టి మెప్పించిన ట్రాక్ రికార్డు అతనిది. సో ఇప్పుడు చైతు స్టార్ హీరో కాబట్టి ఈ వెబ్ సిరీస్ ఇంకో లెవెల్ లో ఉంటుందని చెప్పడానికి సందేహించనక్కర్లేదు. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి

Also Read : బాలయ్య వారసుడిని పరిచయం చేస్తున్నారా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp