iDreamPost
ప్రభాస్ తో ట్రైలర్ లాంచ్ చేయించారు. 2013 మలయాళంలో పృథ్విరాజ్ హీరోగా ముంబై పోలీస్ వచ్చింది.
ప్రభాస్ తో ట్రైలర్ లాంచ్ చేయించారు. 2013 మలయాళంలో పృథ్విరాజ్ హీరోగా ముంబై పోలీస్ వచ్చింది.
iDreamPost
సుధీర్ బాబు కొత్త సినిమా హంట్ ఈ నెల 26న విడుదలకు రెడీ అవుతోంది. సమ్మోహనం తర్వాత ఆ స్థాయి హిట్టు లేక ఇబ్బంది పడుతున్న ఈ హీరోకి వి, శ్రీదేవి సోడా సెంటర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చేదు అనుభవాలు మిగిల్చాయి. అందుకే ఇప్పుడీ హంట్ మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ప్రభాస్ తో ట్రైలర్ లాంచ్ చేయించారు. 2013 మలయాళంలో పృథ్విరాజ్ హీరోగా ముంబై పోలీస్ వచ్చింది. అప్పట్లో పెద్ద హిట్టు. దీని ఆధారంగానే హంట్ ని రూపొందినట్టు కనిపిస్తోంది. మహేష్ త్రిపురనేని దర్శకత్వం వహించగా గిబ్రాన్ సంగీతం సమకూర్చారు. విజువల్స్ చూస్తుంటే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది.
కథేంటో చూచాయగా చెప్పేశారు. ఏసిపి అర్జున్(సుధీర్ బాబు) ఎలాంటి క్లిష్టమైన కేసునైనా సులభంగా పరిష్కరిస్తాడని పేరు. ఓ ప్రమాదం జరిగి గతం మర్చిపోతాడు. ఓ ముఖ్యమైన కేసుకు సంబంధించిన ఆధారాలు తన వద్దే ఉంటాయి. అవి మిస్ అవ్వడంతో పాటు డిపార్ట్ మెంట్ కు పెద్ద సవాల్ గా మారిన ఓ మర్డర్ మిస్టరీని ఛేదించాల్సిన బాధ్యత అర్జున్ మీద పడుతుంది. దీన్ని సవాల్ గా తీసుకున్న అతనికి ఊహించని ప్రమాదాలు ఎదురవుతాయి. వాటిని దాటుకుని చివరికి ఎలా గమ్యం చేరుకున్నాడనేదే అసలు పాయింట్. ఆద్యంతం ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లే కనిపిస్తున్న హంట్ కి ఇదే కీలకం కానుంది. మలుపులు గట్టిగానే సెట్ చేసినట్టు ఉన్నారు.
ముంబై పోలీస్ ఛాయలు కనిపిస్తున్నా కీలకమైన మార్పులు చాలానే చేసినట్టున్నారు. హంట్ కి షారుఖ్ ఖాన్ పఠాన్ తో పాటు బుట్టబొమ్మ నుంచి పోటీ ఎదురు కానుంది. తెలుగు వరకు చూసుకుంటే తీవ్రంగా చెప్పుకునే కాంపిటీషన్ లేకపోవడం హంట్ కి కలిసి వచ్చేలా ఉంది. ప్రేమిస్తే ఫేమ్ భరత్, శ్రీకాంత్ తో పాటు క్యాస్టింగ్ ఇందులో చాలానే ఉంది. సీరియస్ జానర్ కు ఎక్కువగా ఫిట్ అయ్యే సుధీర్ బాబు ఈ హంట్ తో ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి. అంచనాలు పెద్దగా లేకపోవడంతో మౌత్ టాక్ ని నమ్ముకుని వస్తున్న హంట్ హిట్ అయితే కొంత కాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న తనకు ఊరట దక్కినట్టే. ఇందులో గ్లామర్ హీరోయిన్ లేకపోవడం విశేషం