iDreamPost
android-app
ios-app

అర్షద్ వార్సి వ్యాఖ్యలకు సుధీర్ బాబు కౌంటర్

  • Published Aug 20, 2024 | 11:12 AM Updated Updated Aug 20, 2024 | 11:12 AM

Sudheer Babu Response Over Arshad Warsi Comments: తాజాగా సోషల్ మీడియాలో బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ .. కల్కి సినిమా గురించి, ప్రభాస్ గురించి చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ హీరో సుధీర్ బాబు స్పందించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Sudheer Babu Response Over Arshad Warsi Comments: తాజాగా సోషల్ మీడియాలో బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ .. కల్కి సినిమా గురించి, ప్రభాస్ గురించి చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ హీరో సుధీర్ బాబు స్పందించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Aug 20, 2024 | 11:12 AMUpdated Aug 20, 2024 | 11:12 AM
అర్షద్ వార్సి వ్యాఖ్యలకు సుధీర్ బాబు కౌంటర్

టాలీవుడ్ సినిమాలు అటు బాలీవుడ్ లో కూడా మంచి టాక్ తో పాటు.. కలెక్షన్స్ పరంగా కూడా అదే విధంగా సత్తా చూపిస్తూ ఉంటాయి తెలుగు సినిమాలు. ఈ క్రమంలో కొంతమంది బాలీవుడ్ నటులు అక్కడ తెలుగు సినిమాలకు వస్తున్న క్రేజ్ ను తట్టుకోలేక.. విమర్శలు చేస్తూనే ఉంటారు. అడపా దడపా ఇలాంటి వార్తలు చూస్తూనే ఉంటాము. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.. కల్కి సినిమాపై, ప్రభాస్ పైన.. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్. అయితే ఇప్పుడు ఆ కామెంట్స్ కు హీరో సుధీర్ బాబు స్పందించారు. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

తాజాగా బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ.. తానూ కల్కి చూశానని. అంతగా ఏమి నచ్చలేదని.. మ్యాడ్ మ్యాక్స్ రేంజ్ లో దీనిని తీయొచ్చు కానీ.. అలా తీయడంలో హీరో , దర్శకుడు ఫెయిల్ అయ్యారని చెప్పడమే కాకుండా.. ప్రభాస్ గురించి మాట్లాడుతూ జోకర్ లా ఉన్నాడంటూ పలు విమర్శలు చేశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ కామెంట్స్ కు రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ హీరో సుధీర్ బాబు కూడా ఈ విషయంపై స్పందించారు. ‘నిర్మాణాత్మకంగా విమర్శించినా పర్లేదు కానీ.. ఇలా ఒక హీరో గురించి తప్పుగా మాట్లాడడం సరి కాదని.. అర్షద్ వార్సీ లాంటి నటుల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదని . అయినా ప్రభాస్ స్థాయి చాలా పెద్దదని ఇలాంటి చిన్న మాటలను పట్టించుకోరు’ అంటూ సుధీర్ బాబు స్పందించారు.

ఏదేమైనా ఇండస్ట్రీ లో ఇలాంటివన్నీ సహజమే అయినా కూడా.. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ గురించి ఈ విధంగా మీడియా ముందు విమర్శించడం అనేది సరైంది కాదని చెప్పి తీరాలి. ఈ విషయంలో సుధీర్ బాబు చెప్పిన మాటలలో వాస్తవం లేకపోలేదు. ఇక ప్రభాస్ కూడా ఇలాంటి మాటలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. బాక్స్ ఆఫీస్రికార్డ్స్ బద్దలయ్యేలా మరెన్నో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి రెడీ అయిపోతున్నారు. అటు సుధీర్ బాబు కూడా ఇటీవల హరోం హర సినిమాతో మంచి రెస్పాన్స్ ను అందుకున్నారు. ఇక ఇప్పడు జటాధరా అనే మూవీతో … ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోతున్నారు. మరి అర్షద్ వార్సీ కామెంట్స్ కు సుధీర్ బాబు స్పందించిన తీరుపై… మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap