iDreamPost
android-app
ios-app

2 OTTల్లో కనిపించని హరోం హర.. OTT రిలీజ్ వాయిదా?

  • Published Jul 11, 2024 | 4:00 PM Updated Updated Jul 11, 2024 | 4:00 PM

Sudheer Babu Haromhara Not Streaming In OTT: యువ దళపతి సుధీర్ బాబు హరోం హర మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కానీ, రెండు ఓటీటీల్లో కూడా ఎక్కడా కనిపించడం లేదు. సినిమా పోస్ట్ పోన్ అయ్యింది అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

Sudheer Babu Haromhara Not Streaming In OTT: యువ దళపతి సుధీర్ బాబు హరోం హర మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కానీ, రెండు ఓటీటీల్లో కూడా ఎక్కడా కనిపించడం లేదు. సినిమా పోస్ట్ పోన్ అయ్యింది అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

  • Published Jul 11, 2024 | 4:00 PMUpdated Jul 11, 2024 | 4:00 PM
2 OTTల్లో కనిపించని హరోం హర.. OTT రిలీజ్ వాయిదా?

సుధీర్ బాబు కెరీర్ లో బెస్ట్ యాక్షన్ మూవీగా వచ్చిన ‘హరోం హర’ ఓటీటీ ఎంట్రీ గురించి తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ లభించింది. పైగా ఈ సినిమాతో యువ దళపతిగా సుధీర్ బాబు మారిన విషయం తెలిసిందే. దానికి తగినట్లుగానే ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి అప్లాజ్ లభించింది. అయితే థియేటర్లలో ఈ సినిమాని మిస్ అయిన వాళ్లంతా.. ఓటీటీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకు తేజీ కూడా వచ్చేసింది. కానీ, హరోం హర సినిమా మాత్రం ఓటీటీలోకి రాలేదు. ఈ విషయంలో ఇప్పుడు ఫ్యాన్స్ కాస్త నిరాశగా ఉన్నారు.

హరోం హర చిత్రం.. సుధీర్ బాబు నుంచి వచ్చిన ది బెస్ట్ యాక్షన్ డ్రామాగా చెప్పచ్చు. టాలీవుడ్ లో ఈ చిత్రానికి మంచి ప్రశంసలు దక్కాయి. థియటేర్లలో ఈ మూవీని మిస్ అయిన వాళ్లు మాత్రమే కాదు.. చూసిన వాళ్లు కూడా ఈ హరోం హర మూవీని ఓటీటీలో చూడాలి అని ఎదురు చూస్తున్నారు. దానికి తగినట్లుగా జులై 11న హరోం హర చిత్రం ఓటీటీల్లోకి వచ్చేస్తోంది అనే వార్తలు వచ్చాయి. దానికి తగినట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. పైగా రెండు ఓటీటీల్లోకి హరోం హర చిత్రం రిలీజ్ కాబోతోంది అన్నారు. కానీ, తీరా చూస్తే ఇవాళ ఏ ఓటీటీలో కూడా ఆ మూవీ కనిపించడం లేదు. ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి కారణం టెక్నికల్ ఎర్రర్ గా చెప్తున్నారు. సినిమా ఓటీటీ రిలీజ్ వాయిదా పడింది అని కూడా మరో వాదన విపిస్తోంది.

HaromHara

అయితే ఈ ఆలస్యానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఏ కారణంగా సినిమా రిలీజ్ ని ఆపారు? నిజంగానే టెక్నికల్ ఎర్రర్ అనే విషయాన్ని వెల్లడించలేదు. అలాగే తిరిగి ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది? అనే విషయాన్ని కూడా ప్రకటించలేదు. అయితే అధికారిక ప్రకటన రావాలి. లేదంటే.. సినిమా ఓటీటీలోకి వచ్చేసిన తర్వాత సదరు ప్లాట్ ఫామ్స్ ప్రకటిస్తే తెలుస్తుంది. ఈ సినిమా జూన్ 14న థియేటర్లలో విడుదలైంది. క్రిటిక్స్ నుంచి కూడా మంచి మార్కులు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ కోసం డేట్ ఫిక్స్ చేసుకుని ఒక్క అడుగు వెనక్కి తగ్గింది. మరి.. హరోం హర మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom