iDreamPost
android-app
ios-app

హలో తో అఖిల్‌కు బ్లాక్‌బ్ల‌స్ట‌ర్ ఖాయమంటున్న నాగ్‌

హలో తో  అఖిల్‌కు బ్లాక్‌బ్ల‌స్ట‌ర్ ఖాయమంటున్న నాగ్‌

అక్కినేని న‌వ‌త‌రం హీరో అఖిల్ తాజాగా ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు ‘హలో’అంటూ దూసుకొస్తున్న విష‌యం తెలిసిందే..! తొలి సినిమా నిరాశ‌ప‌ర‌చిన నేప‌థ్యంలో త‌న‌యుడి రెండో సినిమా విష‌యంలో నాగ్ త‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌లో అన్నిజాగ్ర‌త్త‌లు తీసుకుని మ‌రీ రూపొందించిన  చిత్ర‌మిది.  అంతేకాదు.. ఈ సారి అఖిల్ ఈ సినిమాతో ఘ‌న‌విజ‌యం సాధించి స‌త్తాచాట‌డం ఖాయ‌మ‌ని నాగార్జున విశ్వాసం వ్య‌క్తం చేస్తుండ‌టం విశేషం. 

అక్కినేని నాగార్జున నిర్మాణంలో తనయుడు అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా నటించిన ‘హలో!’ పాటల విడుదల కార్యక్రమం ఆదివారం రాత్రి విశాఖపట్నంలో జరిగింది. ఈ చిత్రంలో అఖిల్‌ సరసన కల్యాణి నటించింది. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు. అనూప్‌ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆయ‌న‌కు ఇది 50వ చిత్రం కావ‌డం మ‌రో విశేషం. ఈ సంద‌ర్భంగా నాగ్  మాట్లాడుతూ …తెలుగు సినిమా పరిశ్రమకి డ్యాన్సు, గ్రేసు నేర్పింది అక్కినేని నాగేశ్వరరావు. ప్ర‌స్తుతం అఖిల్ లో త‌న‌కు సాక్షాత్తూ త‌న తండ్రి ఏఎన్నార్ క‌నిపిస్తున్నారంటూ అఖిల్ పెర్‌ఫార్మెన్స్ మీద త‌న‌కున్న కాన్ఫిడెన్స్‌ను వ్య‌క్తం చేశారు. అంతేకాదు.. నాగచైతన్యతో ‘రారండోయ్‌ వేడక చూద్దాం’ తీసి హిట్ కొడుతున్నాం.. అని చెప్పి మ‌రీ విజ‌యం సాధించామ‌ని ..  దాని తర్వాత నుంచి అఖిల్‌ సినిమా పనిమీదే ఉన్నాన‌ని, అఖిల్‌ని ఈ సినిమాతో రీ ఎంట్రీ చేస్తున్న‌ట్టుగా  భావించ‌వ‌చ్చ‌ని తెలిపారు.

త‌న‌ను.. అమలని ద‌ర్శ‌కుడు ప్రియదర్శన్ సినిమా ద్వారా క‌లిపార‌ని, ఆ త‌ర్వాత జీవిత భాగ‌స్వాముల‌మ‌య్యామ‌ని, ఇప్పుడు ప్రియ‌ద‌ర్శ‌న్ కూతురు క‌ల్యాణి, అఖిల్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టించ‌డం చిత్ర‌మైన కో ఇన్సిడెన్స్ అని నాగ్ వ్యాఖ్యానించారు.  ఈ నెల 22వ తేదీన ‘హలో’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నామ‌ని, బ్లాక్‌ బస్టర్‌ హిట్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని తేల్చేశారు నాగ్‌. ఇక హీరో అఖిల్‌ మాట్లాడుతూ ‘‘యేడాది కాలంగా ‘హలో’ కోసం భావోద్వేగమైన ప్రయాణం చేశా. అమ్మానాన్నలు గర్వపడేలా ‘హలో’ చేశా.. విజ‌యం మీద మంచి విశ్వాసంతో ఉన్నాన‌ని చెప్పాడు.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet girişdeneme bonusu