iDreamPost
android-app
ios-app

ఎన్టీఆర్‌తో ఛాన్స్‌ కోసం ఆమె వెయిటింగ్‌

ఎన్టీఆర్‌తో ఛాన్స్‌ కోసం ఆమె వెయిటింగ్‌

‘కుమారి 21ఎఫ్‌’తో తెలుగునాట పాపులారిటీ సొంతం చేసుకున్న సొట్టబుగ్గల సుందరి హెబ్బా పటేల్‌, ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. అయితే, ఒకటీ అరా సినిమాలు తప్ప, ఆమెకు పెద్దగా సక్సెస్‌లు లేవు టాలీవుడ్‌లో. అయితే, ‘ఒరేయ్‌ బుజ్జిగా’ సినిమాతో మళ్ళీ హిట్టు కొడతాననే కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తోంది ఈ బొద్దుగుమ్మ. ‘ఒరేయ్‌ బుజ్జిగా’ త్వరలో ఓటీటీ ద్వారా విడుదల కానున్న విషయం విదితమే. కరోనా నేపథ్యంలో చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. మొదట్లో ఓటీటీ కోసం ససేమిరా అన్న ‘ఒరేయ్‌ బుజ్జిగా’ చిత్ర దర్శక నిర్మాతలు, విధి లేని పరిస్థితుల్లో ఓటీటీ రిలీజ్‌ వైపు మొగ్గుచూపారు. ‘ట్రెండ్‌ మారింది. ఓటీటీ చాలామంది నటీనటులకు పని కల్పిస్తోంది. ఓటీటీ కంటెంట్‌కి జనం కూడా అడిక్ట్‌ అవుతున్నారు. అందుకే, వెబ్‌సిరీస్‌లు చేయడానికి సైతం నేను సిద్ధం’ అని హెబ్బా పటేల్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇదిలా వుంటే, తెలుగులో తనకు ఇష్టమైన హీరో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అనీ, ఆయనతో కలిసి డాన్స్‌ చేయాలన్నది తన డ్రీమ్ అనీ హెబ్బా పటేల్‌ వ్యాఖ్యానించింది. ఎన్టీఆర్‌తో ఛాన్స్‌ వస్తే అస్సలు వదులుకోననీ, జస్ట్‌ రెండు నిమిషాలు తెరపై కన్పించినా అది తనకు చాలా గొప్ప విషయమని అంటోంది హెబ్బా పటేల్‌. ఇటీవల ‘భీష్మ’ సినిమాలో హెబ్బా పటేల్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించిన విషయం విదితమే. ఇక, ‘ఒరేయ్‌ బుజ్జి’ విషయానికొస్తే రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు.