భాగ్యనగరంలో భారీ వర్షాలు.. ప్రజలెవరూ బయటకు రావొద్దు!!

  • Published - 06:31 PM, Sun - 10 July 22
భాగ్యనగరంలో భారీ వర్షాలు.. ప్రజలెవరూ బయటకు రావొద్దు!!

హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తుంతోంది. మూడో రోజు కూడా ఆగకుండా వర్షం పడుతూనే ఉంది. ఇవాళ కూడా చిరుజల్లులతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

అధికారులు అంచనా ప్రకారం మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఈ కారణంగా హైదరాబాద్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు అధికారులు. అత్యవసరమైతే తప్ప ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని కోరుతున్నారు.

వర్షాల కారణంగా మాన్సూన్ టీం ను సిద్ధం చేసింది జిహెచ్ఎంసీ. ఏధైనా ఇబ్బంది ఉన్నా, సహాయం కావాలన్నా 040-21111111 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాల్సిందిగా చెప్తున్నారు. దీంతో పాటు కార్పొరేటర్లను సైతం తమ సొంత డివిజన్లలోని పరిస్థితిని పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు. భాగ్యనగర ప్రజల నుంచి ఫిర్యాదులు ఏమైనా వస్తే వెంటనే స్పందించాలని తెలిపారు.

Show comments