iDreamPost
android-app
ios-app

Akhanda : బాలయ్య ముందు బాక్సాఫీస్ భారీ లక్ష్యం

  • Published Nov 30, 2021 | 9:03 AM Updated Updated Nov 30, 2021 | 9:03 AM
Akhanda : బాలయ్య ముందు బాక్సాఫీస్ భారీ లక్ష్యం

ఎల్లుండి విడుదల కాబోతున్న బాలకృష్ణ అఖండ మీద మాములు అంచనాలు లేవు. పోటీగా ఏ సినిమా లేకపోవడంతో క్లాస్ మాస్ ప్రేక్షకులందరి కళ్ళు దీని మీదే ఉన్నాయి. సింహా, లెజెండ్ తర్వాత బాలయ్య బోయపాటి శీను కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ కాబట్టి హైప్ ఓ రేంజ్ లో ఉంది. అనూహ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లోనూ అడ్వాన్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఇక బిసి సెంటర్స్ లో చెప్పాల్సిన పని లేదు. ఉదయం షోల టికెట్లకి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు రెండు వారాల పాటు పుష్ప వచ్చేదాకా వసూళ్ల ఊచకోత ఖాయమనే చెప్పాలి. బిజినెస్ కూడా అలాగే జరిగింది.

ఏపిలో టికెట్ల రేట్లు, పరిమిత షోల నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్ల లెక్కలో కొన్ని మార్పులు జరిగాయి. మొత్తంగా అఖండ థియేట్రికల్ బిజినెస్ 53 కోట్ల దాకా జరిగినట్టు ట్రేడ్ రిపోర్ట్. సీడెడ్ అత్యధికంగా 10 కోట్ల 60 లక్షలకు అమ్ముడుపోయినట్టు తెలిసింది. తర్వాతి స్థానంలో నైజామ్ పది లక్షలకు తక్కువ అదే ఫిగర్ దగ్గర క్లోజ్ అయ్యిందట. ఉత్తరాంధ్ర 6 కోట్లు, ఈస్ట్ గోదావరి 4 కోట్లు, వెస్ట్ గోదావరి 3.5 కోట్లు, గుంటూరు 5 కోట్ల 40 లక్షలు, కృష్ణ 3 కోట్ల 70 లక్షలు, నెల్లూరు 1 కోటి 80 లక్షలు మొత్తంతెలుగు రాష్ట్రాలు కలిపి 45 కోట్ల 50 లక్షల దాకా అయ్యిందట. రెస్ట్ అఫ్ ఇండియా 5 కోట్లు, ఓవర్సీస్ 2 కోట్ల 50 లక్షల దాకా డీల్ చేసినట్టు వినికిడి.

సో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇప్పుడు 54 కోట్ల దాకా తేలనుంది. ఇది అంత సులభం కాదు కానీ పాజిటివ్ టాక్ వచ్చి పది రోజులు హౌస్ ఫుల్ బోర్డులు వేయిస్తే ఈజీగా చేరుకోవచ్చు. ఇప్పటికైతే ట్రైలర్లు, టీజర్లు, పాటలు అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా మైంటైన్ చేశాయి. చాలా కాలం తర్వాత బాలయ్య అసలైన ఊర మాస్ అవతారాన్ని ఇందులో చూడబోతున్నట్టు ఆల్రెడీ ప్రమోషన్ లో గట్టిగా చూపించేశారు. స్టెప్స్ కూడా మంచి హుషారుగా ఉండబోతున్నాయనే క్లారిటీ వచ్చేసింది. అఖండ కోసమే మోహన్ లాల్ మరక్కార్ అరేబియా సింహం ఒక రోజు ఆలస్యంగా 3న విడుదల కాబోతోంది. చూడాలి మరి బాక్సాఫీస్ కు బాలయ్య ఎలాంటి ఉత్సాహం తీసుకొస్తారో

Also Read : Vaali : రీమేక్ కాబోతున్న రెండు దశాబ్దాల పాత క్లాసిక్ ?