iDreamPost
android-app
ios-app

స్టేషన్‌ దాటి పోయి.. మళ్లీ వెనక్కు తిరిగొచ్చిన రైలు!

స్టేషన్‌ దాటి పోయి.. మళ్లీ వెనక్కు తిరిగొచ్చిన రైలు!

’మనం ఎక్కాల్సిన రైలు.. జీవిత కాలం లేట్ అయ్యింది‘ అని అనేక సినిమాల్లో భారీ డైలాగ్ ఉంటుంది. ఆ సంగతమేమో కానీ.. మనం ఎక్కిన రైలు.. చేరాల్సిన గమ్య స్థానం వద్ద ఆగకపోతే మాత్రం గుండెల్లో గాబరా.. దడ మొదలవుతాయి. మైండ్ పని చేయడం ఆగిపోతుంది. ఆ.. స్టేషన్ ఉంటే టికెట్ తీసుకుంటే.. ఎందుకు ఆపరు అనుకుంటున్నారేమో. కొన్ని సార్లు రైల్వే ఉద్యోగుల తప్పిదాల వల్ల కూడా.. కొన్ని స్టేషన్లలో ఆగకుండా వెళ్లిపోతున్నాయి. తాజాగా అటువంటి సంఘటన చోటుచేసుకుంది. ఓ రైల్వే స్టేషన్ దాటి పోయాక.. అక్కడ రైలు ఆపాలని గుర్తుకు వచ్చిందో ఏమో సడెన్ గా బ్రేకులు వేశాడు డ్రైవర్. అయితే అక్కడ ఎక్కలేని, దిగలేని పరిస్థితి.

దీంతో ఆ రైలు వెనక్కు మళ్లించారు. ఈ ఘటన బీహార్‌లోని సరన్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. చాప్రా-ఫరూఖాబాద్ ఉత్సర్గ్ ఎక్స్ ప్రెస్ చాప్రా జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి బుధవారం రాత్రి 7 గంటలకు బయలు దేరింది. రైలు మాంఝీ హాల్ట్ స్టేషన్ వద్దకు వచ్చింది. అయితే రైలు ఆపడం మర్చిపోయాడు ఆ ట్రైన్ డ్రైవర్. దీంతో ప్రయాణీకులు కంగారు పడ్డారు. స్టేషన్‌లో ఆగాల్సిన రైలు ఆగకపోవడంతో ఎక్కాల్సిన ప్రయాణీకులు ఆందోళన చెందారు. దీంతో ఫ్లాట్ ఫామ్ వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే సడెన్ గా స్టేషన్ వచ్చిందని గుర్తించాడేమో డ్రైవర్.. మాంఝీ హాల్ట్ నుండి అర కిమీ దూరంలో ఉన్న వంతెనపై రైలును ఆపేశాడు.

ప్రయాణీకులు ఎక్కేందుకు, దిగేందుకు వీలు కాని ప్రాంతంలో రైలును నిలిపివేశారు. వంతెనపై రైలు ఆపిన తర్వాత.. ఉత్సర్గ్ ఎక్స్ ప్రెస్ డ్రైవర్.. మాంఝీ హాల్ట్ స్టేషన్ మాస్టర్‌ను సంప్రదించి.. విషయం తెలియజేశాడు. ఆ ట్రాక్ పై వచ్చే రైళ్లను ఆపమని స్టేషన్ మాస్టర్ ను కోరాడు. అతను ఇతర స్టేషన్ మాస్టర్లకు సమాచారం అందించారు. చివరకు ఆ రైలు రివర్స్‌లో వెనక్కు కదిలి.. స్టేషన్‌లో ఆగింది. దిగాల్సిన ప్రయాణీకులు డీ బోర్డ్ కాగా, ఎక్కాల్సిన వాళ్లు, ట్రైన్ వెళ్లిపోయిందీ అనుకున్నవాళ్లు.. ఆ రైలు ఎక్కేసి ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఆ రైలు దాదాపు 20 నిమిషాల పాటు ఆలస్యంగా నడిచిందని తెలుస్తోంది.