iDreamPost
android-app
ios-app

ఫుల్‌గా మద్యం సేవించి దొంగతనానికి వెళ్లాడు.. చివరికి ఏమైందంటే..?

దొంగ దొంగ దొరికాడో అన్ని దోచుకుపోతాడో అని పాట వినడానికి బాగున్నప్పటికీ.. వారి చర్యలు భయానకం. కష్టపడి సంపాదించిన సొమ్మును దొంగలు కొట్టేస్తే.. ఆ బాధ వర్ణించలేనిది. అయితే దొంగలు నగదు, వస్తువులే కాదూ, ప్రాణాలను హరించేస్తున్నారు. అయితే వెళ్లిన ప్రతిసారి వారిదే పై చేయి అనుకుంటే పొరపాటు

ఇంట్లో వాళ్ల కళ్లు గప్పి, చాకచక్యంగా దొరికినదంతా దోచుకెళుతుంటారు దొంగలు. దొరికిపోకుండా ఉండేందుకు ఒంటికి నూనె రాసుకోవడం, ముఖాలకు మాస్కులు వేసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇటీవల కాలంలో ముఠాలుగా ఏర్పడి ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసిన ఘటనలు అనేకం చూశాం. చెడ్డీ గ్యాంగ్ పేరుతో ఇళ్లల్లోకి చొరబడి.. బీరువాలకు కన్నాలు వేసి.. అందిన కాడికి నగదు, బంగారం మూట గట్టేస్తుంటారు. ఖరీదైన వస్తువులు కొట్టేస్తుంటారు. ఒక్కొక్కసారి తప్పించుకునే ప్రయత్నంలో ప్రాణాలు కూడా తీస్తుంటారు కరుడు గట్టిన దొంగలు. ఇంత వరకు ఓకే కానీ.. ఇక దొరికారా వారికి బడితే పూజ ఉంటుంది.

దొంగతనానికి వెళ్లిన చోరులు.. చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ, ఎవరు ఎక్కడి నుండి వస్తున్నారో చూస్తూ దొంగతనాలకు పాల్పడుతుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే దొంగలు మాత్రం.. ఫుల్లుగా తాగి ఇంట్లోకి దూరారు. చివరకు కాలనీ వాసులు గుర్తించి.. పట్టుకునే లోపు ముగ్గురు పారిపోగా.. ఒకరు దొరికిపోవడంతో చితక బాదారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. గోనెగండ్ల మండల కేంద్రంలో ఉన్న అచ్చ కట్ట వీధిలో ఓ ఇంట్లో చోరీ చేసేందుకు వచ్చిన నలుగురు దొంగలకు సినిమా చూపించారు. ఫూటుగా తప్పతాగి.. అటుగా వెళ్తూ రహంతుల్లా ఇంటి వద్దకు వెళ్లి.. తాళం పగులకొట్టారు. లోపల ఉన్న బీరువాను పగుల కొట్టగా.. శబ్దాలు రావడంతో ఇరుగుపొరుగు విన్నారు.

వెంటనే స్థానికులు వెళ్లి చూడగా.. అలికిడి విన్న ముగ్గురు దొంగలు పరారయ్యారు. ఓ దొంగ మాత్రం తాగిన మత్తులో కదల్లేక దొరికిపోయాడు. అతడిని పట్టుకుని చితకబాదారు అక్కడి జనాలు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే చోరీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. బీరువాలో పెట్టిన రూ. 3 లక్షలు, మూడు తులాల బంగారం, 20 తులాల వెండి దొంగలు ఎత్తుకుని వెళ్లినట్లు గుర్తించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.