iDreamPost
android-app
ios-app

IPL 2022 : పొలార్డ్ వచ్చే ఏడాది గుజరాత్‌కి ఆడాలి.. హార్దిక్ పాండ్య వ్యాఖ్యలు..

  • Published May 07, 2022 | 1:34 PM Updated Updated May 07, 2022 | 1:34 PM
  • Published May 07, 2022 | 1:34 PMUpdated May 07, 2022 | 1:34 PM
IPL 2022 : పొలార్డ్ వచ్చే ఏడాది గుజరాత్‌కి ఆడాలి.. హార్దిక్ పాండ్య వ్యాఖ్యలు..

IPL 2022లో కొత్త టీం గుజరాత్ టైటాన్స్ అదరగొడుతూ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య టీంని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు అంటూ అందరు ప్రశంసిస్తున్నారు. అయితే శుక్రవారం ముంబైకి, గుజరాత్ కి జరిగిన మ్యాచ్ లో అనూహ్యంగా ముంబై గెలిచింది. ఈ మ్యాచ్ కి ముందు హార్దిక్ పాండ్య మాట్లాడుతూ వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ పొలార్డ్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

గత సీజన్లలో పొలార్డ్, హార్దిక్ పాండ్య ముంబై ఇండియన్స్ తరపున కలిసి ఆడారు. దీంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అయితే ఈ ఏడాది జరిగిన IPL వేలంలో హార్దిక్‌ పాండ్యను ముంబయి వదిలేసింది. పొలార్డ్‌ని మాత్రం జట్టులో ఉంచుకుంది. దీంతో హార్దిక్ పాండ్యని కొత్త జట్టు గుజరాత్‌ తీసుకొని కెప్టెన్‌గా చేసింది. శుక్రవారం నాటి మ్యాచ్ లో పొలార్డ్ 14 బాల్స్ లో కేవలం 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఈ మ్యాచ్ ప్రారంభం ముందు హార్దిక్ పాండ్య మాట్లాడుతూ.. ఈరోజు పొలార్డ్‌ బాగా ఆడాలి. కానీ మేము మ్యాచ్‌ గెలవాలి. నువ్వు బాగానే ఉన్నావా అంటూ తనకు నేను మెసేజ్‌లు పెడుతూ ఉంటాను. పొలార్డ్ ని చాలా మిస్‌ అవుతున్నాం అని చెప్పాను. వచ్చే ఏడాది గుజరాత్‌ టైటాన్స్‌కు ఆడతావేమో అని పొలార్డ్ ని సరదాగా ఆటపట్టిస్తుంటాను. అతడు వచ్చే ఏడాది గుజరాత్‌ జట్టులోకి రావాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. హార్దిక్ కోరుకున్నట్టు పొలార్డ్ ని వచ్చే ఏడాది గుజరాత్ తీసుకుంటుందో లేదో చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet