Idream media
Idream media
అంతర్జాతీయ క్రికెట్‌కు టర్బోనేటర్ హర్భజన్ సింగ్ గుడ్ బై చెప్పడంతోపాటు రాజకీయ ప్రవేశం అంటూ వార్తలు రావడంతో పంజాబ్ రాజకీయాలు కాస్త ఆసక్తికరంగా మారాయి. 23 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలికిన హర్భజన్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ వస్తున్న ఊహాగానాలతో రాజకీయం కాస్త వేడెక్కింది. ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ కోచ్‌గా కూడా హర్భజన్ సింగ్ పేరుని టీమిండియా యాజమాన్యం పరిశీలిస్తోందని ప్రచారం కూడా గట్టిగానే జరుగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ద్వారా భజ్జీ రాజకీయ ఆరంగేట్రం చేస్తాడనే కథనాలు వెలువడుతున్నాయి.ఈ నేపథ్యంలోనే పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ గత కొన్ని రోజులుగా ఆయనతో మంతనాలు జరుపుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత పార్టీని బలోపేతం చేసే అంశంపై అధిష్టానం సీరియస్‌గా దృష్టి సారించింది.ఈ క్రమంలోనే పంజాబ్‌లో ప్రజాదరణ ఉన్న కొంతమంది వ్యక్తుల మీద ప్రశాంత్ కిషోర్ ఫోకస్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.ఈ తరుణంలో హర్భజన్ సింగ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్ కూడా కాస్త పంజాబ్ కాంగ్రెస్‌లో వినపడుతోందనే మాట కూడా ఉంది. కొన్ని ప్రాంతాల్లో హర్భజన్ సింగ్‌కి ఆదరణ ఉందని మరికొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.
అయితే కాంగ్రెస్ పార్టీకి మొదటిసారి చట్టసభలలో ప్రాతినిధ్యం వహించిన లేదా వహించబోయే వ్యక్తిని ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన చరిత్ర లేదు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంపాటు సేవలు అందిస్తే మినహా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి ఒకటికి పది సార్లు కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తూ ఉంటుంది. అయితే సిద్ధూ సూచనతోనే హర్భజన్ సింగ్ పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిశీలిస్తోందని అంటున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థి కాకపోయిన నవజ్యోత్ సింగ్ సిద్ధూని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా ప్రకటించవచ్చనే ఊహాగానాలు వినపడుతున్నాయి. లేదంటే ప్రచార కమిటీ ఛైర్మన్‌గా కూడా హర్భజన్ పేరును పరిశీలించవచ్చు.
భజ్జీ సొంత ప్రాంతం జలంధర్ కాగా శిరోమణి అకాలీదళ్‌ని కట్టడి చేయడానికి అక్కడి నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇటీవల హర్భజన్ సింగ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో భేటీ అయి ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించి ఆ తరువాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వినపడుతున్నాయి.సిద్దూతో భేటీ జరిగిన పది రోజుల తరువాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పడంతో అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు పంజాబ్ కాంగ్రెస్‌లో కూడా ఉత్కంఠగా ఉంది.
కేంద్ర పాలిత ప్రాంతం, పంజాబ్ రాజధాని చండీగఢ్ లో త్వరలో మరోసారి సిద్దూతో హర్భజన్ సింగ్ భేటీ అయిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో సోనియాగాంధీ లేదా రాహుల్ గాంధీ సమక్షంలో హర్భజన్ సింగ్ అధికారికంగా జాయిన్ కావచ్చు అని ప్రచారం కూడా ఊపందుకుంది. శిరోమణి అకాలీదళ్, బహుజన్ సమాజ్ పార్టీతో కలిసి పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో సామాజిక వర్గాల అంచనా వేసుకున్న కాంగ్రెస్ పార్టీ ముందుగా దళిత నేతను ముఖ్యమంత్రిగా చేసి.. ఇప్పుడు హర్బజన్ సింగ్‌పై ఫోకస్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌లో తిరిగి అధికారంలోకి రావడానికి విశ్వప్రయత్నాలు చేస్తోందనేది స్పష్టంగా అర్థమవుతోంది.
Also Read : క్రికెట్‌కు హర్భజన్ సింగ్ వీడ్కోలు
ఒకవేళ భజ్జీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన లేదా కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించిన సరే పార్టీలో పరిణామాలు వేగంగా మారే అవకాశాలు ఉంటాయని, మరికొంతమంది సీనియర్ నేతలు కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో నడిచే అవకాశం కూడా ఉండవచ్చని అంటున్నారు.