iDreamPost
android-app
ios-app

Ap విద్యార్థులకు గమనిక.. ఒంటి పూట బడులు పొడగింపు!

Ap విద్యార్థులకు గమనిక.. ఒంటి పూట బడులు పొడగింపు!

ఈ ఏడాది సూర్యుడు తీవ్ర స్థాయిలో తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ వేడి తీవ్రతకు భూమిపై ఉండే జీవాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఎంతో మంది వడ దెబ్బ తగిలి మృతి చెందారు. జూన్ నెల సగం గడిచిన ఎండ తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. ఇదే సమయంలో పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం అయ్యాయి. అయితే అధిక వేడి కారణంగా విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

రాష్ట్రంలోని పాఠశాలలు జూన్ 12 తిరిగి ప్రారంభమైన విషయం తెలిసింది. ప్రతిపక్ష పార్టీలు మరో కొన్ని రోజుల వరకు సెలవులు పొడగించాలని డిమాండ్ చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే  తొలుత జూన్ 12 నుంచి17 వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ సమయం కాస్తా పూర్తి కావడంతో తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఒంటి పూట బడులను 24 వరకు పొడగిస్తూ విద్యా శాఖ ఆదివారం కీలక  నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు బోధన సమయంగా నిర్ణయించారు. అలానే ఉదయం 8.30 నుంచి 9 వరకు విద్యార్థులకు రాగిజావా పంపిణీ చేయానున్నారు. అదే విధంగా ఉదయం 11.30 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం భోజనం ఉంటుందని విద్యాశాఖ  స్పష్టంచేసింది. మరి.. విద్యార్థుల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో  తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి