iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లోని ప్రస్తుత ప్రభుత్వంలో పలువురు పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. సీనియర్ జర్నలిస్టులు చక్రం తిప్పే బాధ్యతల్లో కనిపిస్తున్నారు. సుదీర్ఘకాలం పాటు జర్నలిస్టు సంఘాల్లోనూ, ఇతర వ్యవహారాల్లోనూ ముఖ్య భూమిక పోషించిన వారు సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు. ఏకంగా ఓ సీనియర్ జర్నలిస్ట్ ఇప్పుడు క్యాబినెట్ లో కూడా ఉన్నారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రభుత్వం పాత్రికేయులు సంక్షేమం దృష్టి దృష్టిపెట్టలేదన్న అసంతృప్తి ప్రాత్రికేయవర్గాలలో నెలకొనివుంది. ఎన్నికల ముందు తమ గురించి మాటలే తప్ప ఇప్పుడు జగన్ సర్కారు జర్నలిస్టుల సంక్షేమం గురించి కనీసం స్పందిస్తున్న దాఖలాలు కూడా లేవని బాధపడుతున్నారు .
ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా 40వేల మంది జర్నలిస్టులున్నారు. వారిలో 30వేల మందికి అక్రిడిటేషన్లు కూడా ఉన్నాయి. అయినా వారి బాగోగులను చంద్రబాబు సర్కారు విస్మరించింది. ఎన్నో ఆశలు కల్పించి ఉసూరుమనిపించింది. ఫలితంగా మీడియా యాజమాన్యాల సంగతి పక్కన పెడితే క్షేత్రస్థాయి జర్నలిస్టుల్లో అత్యదికులు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. అందుకు తగ్గట్టుగానే వైఎస్సార్సీపీ నేతలు కూడా కొత్త ఆశలు చిగురించేలా మాట్లాడడం, జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే అభిప్రాయం ఉండడంతో పలువురు ప్రత్యక్షంగానే జగన్ కి అనుకూలంగా వ్యవహరించారు. అయినా గానీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా కనీసం మాటమాత్రంగా కూడా జర్నలిస్టుల సంక్షేమం గురించి సర్కారీ పెద్దలు మాట్లాడకపోవడం విచారకరం.
జగన్ ప్రభుత్వం అధికారంకి రాగానే సీఎం హోదాలో సంతకం పెట్టిన తొలి మూడు సంతకాల్లో ఒకటి ఇన్సూరెన్స్ ని 5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచడం. దాంతో తొలినాళ్లలోనే తమకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ ముఖ్యమంత్రి హయంలో తమ కోరికలు తీరతాయని అంతా ఆశించారు. ఏపీలో జర్నలిస్టుల సుదీర్ఘ డిమాండ్ ఇళ్లు, ఇళ్ల స్థలాలు. ఇప్పుడు ప్రభుత్వం రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలుండకూడదనే సంకల్పంతో సాగుతున్నట్ట చెబుతోంది. అందుకు గానూ ఉగాది నాడు ఇళ్ల పట్టాల మంజూరుకి చారిత్రక నిర్ణయం తీసుకుంది. సన్నాహాలు కూడా చేపట్టింది. అందులో జర్నలిస్టులను మాత్రం విస్మరించింది. సమాచార శాఖ మంత్రిగా పేర్ని నాని గతంలోనే పేదలకు ఇచ్చిన స్థలం కన్నా జర్నలిస్టులకు మరింత మేలు చేసేలా జగన్ ఆలోచిస్తున్నట్టు ప్రకటించారు. దాంతో ఇళ్లస్థలాల విషయంలో ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని ఆశించారు. కానీ తీరా చూస్తే ఇప్పుడు జర్నలిస్టులను పూర్తిగా విస్మరించారు. పేదలకు ఇచ్చిన దానికన్నా రెట్టింపు స్థలం గానీ, అపార్ట్ మెంట్లు గానీ నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం పాత్రికేయులను పట్టించుకోకపోవడం ఆందోళనకరంగా మారుతోంది.
వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి సారిగా వైఎస్సార్ మాత్రమే జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించారు. 2008లో ఆయన జర్నలిస్టులకు హౌసింగ్ కేటాయించిన తర్వాత నలుగురు సీఎంలు వచ్చినా న్యాయం జరగలేదు. ఈ పుష్కర కాలంలో పాత్రికేయుల సంఖ్య భారీ స్థాయిలో పెరిగింది. కానీ ప్రయోజనం మాత్రం దక్కిన దాఖలాలు లేవు. కొన్ని చోట్ల రూరల్ ప్రాంతాల్లో కొందరు ఎమ్మెల్యేల చొరవతో ప్రయోజనం దక్కినా అత్యధిక మంది ఆశానిరాశల మధ్య కొట్టిమిట్టాడుతున్నారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయింపు విషయంపై చర్చించేందుకు ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం చెప్పింది. రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కమిటీ ప్రతిపాదనల ఆధారంగా ఇళ్లస్థలాలు ఇస్తామని తెలిపారు. కానీ ఇప్పుడు కమిటీ ఏమయ్యిందో..వారి సిఫార్సులు ఎక్కడో అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఇళ్లపథకంలో జర్నలిస్టులు లబ్ధిదారులుగా చేర్చాలని అధికారుల వద్దకు వెళ్లితే వీలు కాదంటున్నారు. ప్రస్తుతం అలాంటి అవకాశం ప్రభుత్వం కల్పించడం లేదని చెబుతున్నారు.