రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజారంజకమైన పాలన అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాల అమలుపై సర్వే చేయడానికి ఒక సీనియర్ ప్రభుత్వ అధికారికి అధికారిక హెలికాప్టర్ ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్.
సంక్షేమ పథకాలు గిరిజనులకు అందుతున్నాయో లేదో సర్వే చేయడానికి అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తున్న ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కి ముఖ్యమంత్రి జగన్ హెలికాప్టర్ ఇచ్చి మరీ పంపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విశాఖపట్నం ప్రాంతంలో గిరిజన ప్రాంతాల్లో పర్యటించిన ప్రవీణ్ ప్రకాష్ కి ఒక రెసిడెన్షియల్ స్కూల్ లో రాత్రికి బస ఏర్పాటు చేశారు.
ఈ విషయంపై ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ ఒక అధికారికి గిరిజన సంక్షేమ పథకాలు విషయమై సర్వే చేయడానికి హెలికాఫ్టర్ ఇచ్చి మరీ పంపడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని వెల్లడించారు. ఈ అనుభవం ఎంతో గౌరవంగా రిఫ్రెషింగ్ గా ఉందని తెలిపారు.ప్రజా సంక్షేమం పట్ల కాగా ముఖ్యమంత్రి జగన్ కి ఉన్న చిత్తశుద్ధిపై అందరినుండి ప్రశంసలు దక్కుతున్నాయి.