iDreamPost
iDreamPost
దశాలవారీగా మద్యం నిషేధిస్తానని సామాన్యుడికి మద్యం అందకుండా చేసి వారి జీవితాల్లో వెలుగు నింపుతానాని వాగ్దానం చేసిన జగన్, ప్రభుత్వ పరంగా మద్య వినియోగం తగ్గించడమే కాదు . ఎక్కడ అక్రమ మద్యం కనపడ్డా కఠినంగా వ్యహరించి ఉక్కు పాదం మోపుతున్నాడు .
గత వారం ఎన్నికల నిర్వహణ సమీక్షలో గోదావరి జిల్లాలో అక్రమ మద్యం , సారా తయారీ తన దృష్టికి వచ్చిందని ఎన్నికల సమయంలో డబ్బూ , మద్యం ప్రభావం చూపకుండా ఉండాలని సత్వరమే ఈ విషయం పై దృష్టి పెట్టమని పోలీస్ శాఖని ఆదేశించాడు.
దరిమిలా డీజీపీ ఆదేశాల మేరకు పోలీస్ మరియు డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ వారి ఆధ్వర్యంలో వందలాది మంది అధికారుల పర్యవేక్షణలో దాదాపు పది వేల మంది పోలీస్ లతో ఈ రోజు ఉదయం నాలుగు నుండి మెరుపు దాడులకు దిగారు.
ఈ సందర్భంగా ఈస్ట్ గోదావరి జిల్లాలోని తిమ్మాపురం , కొత్తూరు , వంతాడ గ్రామాల్లో , ఇంకా పలు ప్రాంతాల్లో సారా తయారీని గుర్తించి బెల్లం ఊటలు ధ్వంసం చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారని ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయని సమాచారం.డబ్బు,మధ్య లేకుండా ఎన్నికలు జరుగుతాయా?ప్రభుత్వం ఎన్ని చెప్పినా ఎన్నికల్లో మద్యం,డబ్బు ప్రవహిస్తాయని నమ్మిన వాళ్లకు ఈ దాడులు భయం పుట్టిస్తున్నాయి.
దశాలవారీ మద్య నిషేధం పట్ల , అక్రమ మద్యాన్ని , నాటు సారాని అరికట్టే విషయంలో , ఎన్నికల్లో డబ్బు , మద్యం ప్రభావం లేకుండా నిర్వహించే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇవవటం ఖాయం. .