iDreamPost
android-app
ios-app

ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. టీఎస్ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ ఆమోదం

ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. టీఎస్ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ ఆమోదం

టీఎస్ఆర్టీసీ సంస్థను కాపాడుకునేందుకు కేసీఆర్ నేతృత్వంలోని సర్కార్ పలు సంస్కరణలను చేపట్టింది. దీనిలో భాగంగానే టీఎస్ఆర్టీసీ కార్మికులను, సంస్థలో పనిచేసే ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకునేలా బిల్లును రూపొందించింది. కాగా ఈ బిల్లు ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపించగా కొద్ది రోజులుగా పెండింగ్ లో ఉంది. తాజాగా ఈ విలీనం బిల్లుకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో సంస్థలో పనిచేస్తున్న కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం బిల్లును రూపొందించి ఆసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ తరువాత టీఎస్ఆర్టీసీ విలీనం బిల్లు సభ ఆమోదం పొందింది. అనంతరం గవర్నర్ ఆమోదం కొరకు పంపించగా గవర్నర్ తమిళిసై పలు అనుమానాలను వ్యక్తం చేసూ పెండింగ్ లో పెట్టింది. దీంతో కార్మికులు ఆందోళనకు గురయ్యారు. బిల్లును ఆమోదించాలని రాజ్ భవన్ ముందు నిరసనకు దిగారు ఆర్టీసీ కార్మికులు. అయితే తాజాగా టీఎస్ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపింది. తాను లేవనెత్తిన పది ప్రతిపాదనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో బిల్లును ఆమోదించినట్లు తెలిపింది. గవర్నర్ ఆమోదంతో టీఎస్ఆర్టీసీలో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ కార్మికులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి