iDreamPost
android-app
ios-app

ఫలించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి కృషి.. పల్నాడు జిల్లా కేంద్రంగా నిలిచిన నరసరావుపేట

  • Published Jan 26, 2022 | 12:06 PM Updated Updated Jan 26, 2022 | 12:06 PM
ఫలించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి కృషి.. పల్నాడు జిల్లా కేంద్రంగా నిలిచిన నరసరావుపేట

పార్లమెంట్ నియోజకవర్గాల ప్రతిపాదికన జిల్లాల పునర్విభజన అంశం ప్రస్తావనకు వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ప్రాంతాల వారీగా కొన్ని చోట్ల జిల్లా డిమాండ్లు , కొన్ని జిల్లా కేపిటల్ డిమాండ్స్ వినవచ్చాయి . పార్లమెంట్ స్థానం ప్రతిపాదికన కాకుండా భౌగోళిక స్వరూపం , అభివృద్ధి అనుకూలతలు , స్థానిక సెంటిమెంట్ రూపాలతో వచ్చిన డిమాండ్ల మూలంగా జిల్లా కేంద్రాల ఎంపికలో కొంత అసందిగ్ధత ఎదుర్కొన్న ప్రాంతాల్లో నరసరావుపేట ముందు ఉంది అని చెప్పవచ్చు.

ప్రధానంగా పల్నాడులోని ఇతర ప్రాంతాలైన పిడుగురాళ్ల , దాచేపల్లి , మాచర్ల వంటి ప్రాంతాల నుండి తమ ప్రాంతాన్ని కేపిటల్ గా జిల్లా ఏర్పాటు చేయమనే డిమాండ్స్ వచ్చాయి . అందుకు అనుగుణంగా ఆయా ప్రాంతాల ప్రతినిధులు సైతం ముఖ్యమంత్రికి లేఖలు రాయడం , వ్యక్తిగతంగా కలిసి వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది . పలు బహిరంగ వేదికల పై సైతం ఇదే డిమాండ్స్ ని ప్రధానంగా వినిపించారు .

పార్లమెంట్ కేంద్ర స్థానమైన నరసరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సున్నితమైన పల్నాడు ప్రాంత నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ డిమాండ్స్ పట్ల బహిరంగంగా వ్యతిరేకత ప్రదర్శించకుండా , ప్రాంతీయ వివాదాలు రేకెత్తకుండా సంయమనం పాటిస్తూ రెండు శతాబ్దాల పై చరిత్ర గల నరసరావుపేట భౌగోళికంగా పార్లమెంట్ స్థానం లోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఆరు నియోజక వర్గాలకు సమదూరంలో కేంద్ర స్థానంగా ఉండటంతో పాటు , నేషనల్ , స్టేట్ హైవేలకు దగ్గరగా అన్ని విధాల ఉన్న అనుకూలతలు వివరిస్తూ నరసరావుపేటనే జిల్లా కేంద్రంగా ఉంచాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పలు దఫాలు లేఖల ద్వారా విజ్ఞప్తి చేశారు .

తరువాతి రోజుల్లో స్థానిక ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రిని కలిసి విద్య , వైద్యం , వాణిజ్య , రవాణాపరంగా నరసరావుపేట మిగతా ప్రాంతాల కన్నా మెరుగ్గా ఉండటంతో పాటు , కోటప్పకొండ కేంద్రంగా టూరిజం అభివృద్ధి చెందిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు . అలాగే జిల్లా స్థాయిలో అవసరమైన జిల్లా కోర్టు , ఆర్డీవో కార్యాలయాలు ఇప్పటికే అందుబాటులో ఉండటంతో పాటు , మిగతా ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన ప్రభుత్వ భూమి పట్టణానికి దగ్గరలోనే అందుబాటులో ఉన్న విషయాలను సమగ్రంగా వివరించి ఎట్టకేలకు నరసరావుపేట పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పాటు కావటానికి ఉన్న అడ్డంకులు తొలగించుకోవడంలో విజయం సాధించి స్థానిక ప్రజల ఆకాంక్షలను నిలబెట్టారని చెప్పొచ్చు .

Also Read : కందుకూరు ఎక్కడ నుంచి వచ్చిందో.. తిరిగి అక్కడికే..!