iDreamPost
android-app
ios-app

పవర్ ఫుల్ రీమేక్ కోసం గోపీచంద్ ?

  • Published Nov 17, 2020 | 5:52 AM Updated Updated Nov 17, 2020 | 5:52 AM
పవర్ ఫుల్ రీమేక్ కోసం గోపీచంద్ ?

ఏ ముహూర్తంలో అటు చిరంజీవి లూసిఫర్ ఇటు పవన్ కళ్యణ్ అయ్యప్పనుం కోశియుమ్ రీమేకులు చేయాలని డిసైడ్ అయ్యారో అప్పటి నుంచి క్యాస్టింగ్ విషయంలో, దర్శకులను ఫైనల్ చేయడంలో అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం వకీల్ సాబ్ పూర్తి చేయడం మీద దృష్టి పెట్టిన పవన్ ఆ తర్వాత తక్కువ రోజుల్లో అయ్యప్పనుంని ఫినిష్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ ఆల్మోస్ట్ లాక్ అయ్యింది. దర్శకుడు సాగర్ చంద్ర మెయిన్ క్యారెక్టర్స్ లో కొన్ని కీలకమైన మార్పులు కూడా చేసి సిద్ధంగా ఉన్నారట. అయితే కథ కథ ప్రకారం నువ్వా నేనా అనే ఈగోల యుద్ధం చేసే వాళ్ళలో రెండో హీరో ఎవరు అనే సస్పెన్స్ మాత్రం ఇంకా వీడలేదు.

రవితేజ,రానా, సుదీప్ ఇలా చాలా పేర్లే బయటికి వచ్చాయి కానీ అవేవి కార్యరూపం దాల్చే ఛాన్స్ లేనట్టే. తాజాగా మ్యాచో హీరో గోపిచంద్ నేమ్ తెరమీదకొచ్చినట్టు సమాచారం. ఒరిజినల్ వెర్షన్ లో పృథ్విరాజ్ చేసిన పాత్రకు అతనైతేనే బెస్ట్ ఛాయస్ గా నిలుస్తాడని మార్కెట్ పరంగా కూడా చాలా హెల్ప్ అవుతుందని యూనిట్ భావిస్తున్నారట. అయితే సీటిమార్ పనుల్లో బిజీగా ఉన్న గోపిచంద్ ప్రతిపాదన విన్నాడు కానీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఒకవేళ ఓకే అయితే కాల్ షీట్స్ త్వరగా బుక్ చేసుకుని వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట.

గోపిచంద్ అయితే పర్ఫెక్ట్ ఛాయస్ అని చెప్పొచ్చు. పాజిటివ్ అయినా నెగటివ్ అయినా హీరోతో సమానంగా సినిమాను మోసే క్యాలిబర్ గోపిచంద్ కు ఉంది. వర్షం, జయం, నిజంలో పెర్ఫార్మన్స్ గురించి వేరే చెప్పాలా. పైగా అయ్యప్పనుం పాయింట్ ఇతనికి బాగా సూట్ అవుతుంది. దానికి తోడు పవన్ కళ్యాణ్ తో ఢీ కొడితే అంత కన్నా కిక్ ఇచ్చే అంశం అభిమానులకు ఇంకేం ఉంటుంది. మొత్తానికి ఎవరో ఒకరిని వీలైనంత త్వరగా లాక్ చేసుకోవడం చాలా అవసరం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు బిల్లారంగా టైటిల్ పరిశీలనలో ఉంది. హీరోయిన్ల ఎంపిక కూడా పూర్తి కాలేదు