iDreamPost
android-app
ios-app

ఆ ఊరిలో గూండా ట్యాక్స్! కట్టకపోతే ఇలాంటి దారుణం!

ఆ ఊరిలో గూండా ట్యాక్స్! కట్టకపోతే ఇలాంటి దారుణం!

పని చేసుకుని బతకలేని కొందరు.. రౌడీయిజం చేస్తూ సామాన్య ప్రజలను పీక్కుతింటూ..తమ పబ్బం గడుపుకుంటారు. ఓ నలుగురు మనుషుల్ని వెంటేసుకుని, బెదిరించి మరీ డబ్బులు వసూలు చేస్తుంటారు. చిన్న చిన్న షాపుల దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారస్తులు, కాంట్రాక్టర్ల వద్ద నుండి దౌర్జన్యంగా మామూళ్ల రూపంలో దందా వసూలు చేస్తుంటారు. గూండాయిజం చెలాయిస్తూ పన్నుల రూపంలో డబ్బును కొల్లగొడుతుంటారు. లేదంటే దాడి చేయడం, దుకాణాల్లోని సరుకులను నాశనం చేస్తుంటారు. వీరికి ఎదురే చెప్పేవారు లేకపోవడం,  రాజకీయ పెద్దల అండ కూడా ఉండటంతో వీరి ఆగడాలకు అడ్డు, అదుపూ ఉండటం లేదు. తాజాగా గూండా పన్ను చెల్లించలేదన్న కారణంగా ఎమ్మెల్యే అనుచరులు ఏకంగా 7 కిలో మీటర్ల మేర రోడ్డును తవ్వేశారు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. గూండా పన్ను చెల్లించేందుకు కాంట్రాక్టర్ నిరాకరించడంతో స్థానిక ఎమ్మెల్యే అనుచరులమని చెప్పుకునే కొందరు.. షాజహాన్ పూర్ లోని కొత్త రహదారిని ఏడు కిలోమీటర్లు తవ్వి ప్రజా ఆస్తిని ధ్వంసం చేశారు. గోరఖ్ పూర్‌కు చెందిన కాంట్రాక్టర్ శకుంతలా సింగ్ మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే ప్రతినిధినని చెప్పి జస్వీర్ సింగ్ అనే వ్యక్తి వచ్చి.. కమిషన్ ఇవ్వాలని తనను డిమాండ్ చేశాడని, తాను ఇవ్వకపోయే సరికి, ఇలా రోడ్డును తవ్వేశారని చెప్పారు. రోడ్డు నిర్మాణానికి బడ్జెట్ రూ. 12 కోట్లు ఉండగా.. ఆ రాజకీయ నేత భారీగా కమీషన్ డిమాండ్ చేస్తన్నాడని పేర్కొంటూ.. జిల్లా మేజిస్రేట్‌కు ఫిర్యాదు చేశారు.

టాక్స్ కట్టనని చెప్పినందుకే తాము వేసిన రహదారిని 7 కిలో మీటర్ల మేర తవ్వేశాని కాంట్రాక్టర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజా ఆస్తుల నష్ట నిరోధక చట్టం కింద జగ్వీర్ సింగ్‌తో పాటు 20 మది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఆరోపణలను స్థానిక ఎమ్మెల్యే కొట్టి పారేశారు. తక్కువ నాణ్యత గల మెటీరియల్ ఉపయోగించడంతో కాంట్రాక్టరే ఇలా చేసి ఉంటాడని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. బీమా క్లెయిమ్ చేసుకునేందుకు అతడే ఈ రోడ్డును తవ్వించి ఉంటాడని ఆరోపించారు. కాగా, జిల్లా మేజిస్ట్రేట్ ఈ అంశంపై విచారణ చేపట్టారు. కాగా, ఇప్పటికీ ముగ్గుర్ని అరెస్టు చేశామని, జగ్వీర్ పరారీలో ఉన్నాడని తెలిపారు.