iDreamPost
android-app
ios-app

అధికారంలో ఉన్నప్పుడు లెక్కలు, ఇప్పుడు కర్మ సిద్ధాంతం.. లోకేష్ తీరు

అధికారంలో ఉన్నప్పుడు లెక్కలు, ఇప్పుడు కర్మ సిద్ధాంతం.. లోకేష్ తీరు

పాపం చేయడం వల్ల నష్టం.. పుణ్యం చేయడం వల్ల మేలు జరుగుతుందంటారు. ఇతరులకు అన్యాయం చేయొద్దు.. ఆ పాపం ఊరికేపోదు.. తప్పక తగులుతుంది.. అని ఎవరైనా చెబితే తప్పక పరిగణలోకి తీసుకుని సరిచేసుకోవాలి. తెలిసి ఎవరికీ అన్యాయం చేయకూడదు. ఒక వేళ తెలియక చేసినా సరిదిద్దుకోవాలని పెద్దలు చెబుతుంటారు. పెద్దలే కాదు చేసిన పాపం వల్ల ఫలితం అనుభవించిన వారు కూడా చెబుతుంటారు. వయస్సుతో సంబంధం లేకుండా అట్టి వారి మాటలను తప్పక వినాలి. తప్పులు ఉంటే సరిదిద్దుకోవడం మంచిది.

చిన్న వయస్సు అయినా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన నారా లోకేష్‌ పాపపుణ్యాల గురించి చెబుతూ వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. హెచ్చరించడం అనడం కన్నా.. శాపనార్థాలు పెడుతున్నారనుకోవాలి. ప్రతి నెలా రాష్ట్రంలో సామాజిక పింఛన్లు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల కొంత మందికి పింఛన్‌ సొమ్ము అందలేదు. ఎందుకు అందలేదో వాలంటీర్లు కారణాలను వివరించారు. ఆయా లోపాలను సరిదిద్దుకుని మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పింఛన్లు మంజూరవుతాయని చెప్పారు. ఆ పని కూడా వాలంటీర్లే చేపట్టారు. అనర్హులకు అవకాశం లేదు.

విషయం ఏదైనా ప్రభుత్వాన్ని, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసే నారా లోకేష్‌ ఫింఛన్ల విషయంలోనూ అదే తీరున వ్యవహరించారు. వైసీపీ ప్రభుత్వం గత మూడు నెలల్లో 2.40 లక్షల మంది పింఛన్లను తొలగించిందని చెప్పారు. పింఛన్‌ పోయిందనే మానసిక క్షోభతో 13 మంది పండుటాకులు ప్రాణాలు కోల్పోయారని చెబుతూ.. ఈ పాపం ఊరికే పోదని వైసీపీ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు.

Also Read : వినాయక చవితి ఉత్సవాలను వైఎస్ వర్థంతి సభతో పోల్చటం చంద్రబాబుకే సాధ్యం

లోకేష్‌ చెప్పింది నిజమే. అర్హత ఉండి పింఛన్‌ నిలిపివేస్తే పాపమే. ఆ పాపం తప్పక తగులుతుంది. అందుకు లోకేష్‌ పార్టీనే సాక్ష్యం. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం, జన్మభూమి కమిటీలు చెప్పిందే వేదంలా పాలన సాగించింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చీ రాగానే.. వృద్ధుల ఫించన్లపై పడ్డారు. జన్మభూమి కమిటీలు అర్హత లేదని తేల్చాయంటూ.. ఏళ్ల తరబడి పింఛన్‌ తీసుకుంటున్న వారికి అన్యాయం చేశారు. జన్మభూమి కమిటీలను కాదని జిల్లా కలెక్టర్‌ కూడా అర్హులకు పింఛన్లు మంజూరు చేసే పరిస్థితి లేకపోయింది. అన్యాయంగా పింఛన్లు తొలగించారని బాధితుల తరఫున గ్రామ స్థాయి వైసీపీ నేతలు, వైసీపీ తరఫున గెలిచిన సర్పంచ్‌లు అప్పట్లో కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. అప్పటి ప్రతిపక్ష  వైసీపీ మండల కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్ల వద్ద పలుమార్లు ఆందోళనలు నిర్వహించింది. అయిన ఫలితం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో వేలాది మందికి అన్యాయం జరిగింది. కేవలం వైసీపీ సానుభూతి పరులనే కారణంతో జన్మభూమి కమిటీల సిఫార్సుతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ దురాఘతానికి ఒడిగట్టింది.

కేవలం పింఛన్‌పై ఆధారపడి వృద్ధులు తమ పింఛన్‌ నిలిపివేసిన చంద్రబాబు ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు. తమ ఉసురు ఊరికేపోదని జన్మభూమి కమిటీ సభ్యులను తిట్టిపోశారు. వారి శాపనార్థాలు, వచ్చే పింఛన్‌ను తొలగించిన పాపమే టీడీపీకి 2019లో తగిలినట్లుంది. అందుకే ఘోరాతిఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. చరిత్రలో ఎవరూ చేయని పాపాన్ని చేసిన టీడీపీ.. చర్రితలో ఎన్నడూ ఎరగని ఓటమిని చవిచూసింది. 175 సీట్లకు గాను కేవలం 23 సీట్లే టీడీపీకి వచ్చాయి. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన నారా లోకేష్‌ కూడా ఓడిపోయారు. అందుకే చేసిన పాపం ఊరికే పోదని ఆయన స్వానుభవంతో వైసీపీ హెచ్చరిస్తున్నట్లుగా ఉంది.

Also Read : సంక్షేమ పథకాలతో లక్ష కోట్లు.. అదే వారయ్యుంటే 30 వేల కోట్లు కమీషన్లకే.. సజ్జల పోలిక అదిరింది