iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు శుభావార్త.. బంగారం ధర రూ.50 వేల దిగువకు పడిపోయే ఛాన్స్‌.. ఎప్పుడంటే!

  • Published Jun 24, 2023 | 6:50 PMUpdated Jun 24, 2023 | 7:29 PM
  • Published Jun 24, 2023 | 6:50 PMUpdated Jun 24, 2023 | 7:29 PM
పసిడి ప్రియులకు శుభావార్త.. బంగారం ధర రూ.50 వేల దిగువకు పడిపోయే ఛాన్స్‌.. ఎప్పుడంటే!

భారతీయులకు బంగారంతో విడదీయరాని అనుబంధం ఉంది. మరీ ముఖ్యంగా మన దేశ మహిళలకు బంగారం అంటే విపరీతమైన ఇష్టం. కేవలం అలంకరణ కోసం మాత్రమే కాక.. అత్యవసర సమయంలో అక్కరకు వచ్చే నిధిగా భావిస్తారు. అందుకే పండుగలు, వివాహాది శుభకార్యాల వేళ మాత్రమే కాక.. చేతిలో ఏమాత్రం డబ్బులు ఉన్నా బంగారం కొనుగోలు చేయడానికే తొలి ప్రాధాన్యత ఇస్తారు. అయితే గత కొన్నాళ్లగా బంగారం ధర.. రాకెట్‌ కన్నా వేగంగా దూసుకుపోతుంది. ఈ ఏడాది ఇప్పటికే బంగారం 10 గ్రాముల ధర ఏకంగా 60 వేల రూపాయలు దాటింది. పెరగడమే తప్ప తగ్గడం తనకు తెలియదు అన్నట్లుగా ఉంది బంగారం ధర పరిస్థితి. ఇక బంగారం ధర ఫెడ్‌ వడ్డీ రేట్లు, అంతర్జాతీయ మార్కెట్‌లో ఏర్పడే పరిణామాలకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఇప్పుడైతే బంగారం ధర దిగి వచ్చే సూచనలు కనిపించడం లేదు. కానీ త్వరలోనే బంగారం తులం ధర 50 వేల రూపాయల దిగువకు పడిపోయే ఛాన్స్‌ ఉంది అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు.

ప్రస్తుతం హైదరాబాద్, ఇతర ప్రధాన నగరాల్లో 24 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర రూ. 59 వేల రూపాయలకు పైగా ఉంది. అలానే 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర 54 వేల రూపాయలుగా ఉంది. అయితే గత కొంతకాలంగా అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టడం వలన దేశీయంగా కూడా బంగారం ధరలు దిగి వస్తున్నాయని అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం అమెరికన్ బులియన్ మార్కెట్లో ఒక ఔన్స్ (31 గ్రాములు) బంగారం ధర 1920 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈనెల ప్రారంభంలో ఈ ధర 1980 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అయితే గత 20 రోజుల వ్యవధిలో బంగారం ధర సుమారు 60 డాలర్ల మేర దిగి వచ్చి.. ప్రస్తుతం 1920 డాలర్ల వద్ద స్థిరపడింది. అదే గత నెలతో పోల్చినట్లయితే బంగారం ధర ఏకంగా 110 డాలర్లు తగ్గింది. మన దగ్గర కూడా ఆషాడమాసంలో బంగారానికి డిమాండ్‌ తగ్గడంతో.. ధర దిగి వస్తుంది.

అంతేకాదు అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు దిగి వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం డాలర్ విలువ పుంజుకోవడం అని చెప్పవచ్చు. ప్రస్తుతం డాలర్ మారకం విలువ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది. దేశీయంగా కూడా బంగారం ధర భారీగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 24 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర 60,000 దిగువనే ఉంది. రానున్న రోజుల్లో ఈ ధర మరింత దిగివచ్చే అవకాశం ఉందరి.. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ నాటికి పసిడి ధర రూ. 50 వేల దిగువకు పడిపోయే అవకాశం ఉంది అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి